Supreme Court Judge Justice Sanjiv Khanna Visit Araku : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాతోపాటు 25 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈనెల 12న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటించనున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. చోడవరం 9వ అదనపు సెషన్స్ న్యాయమూర్తి రత్నకుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో కలిసి సోమవారం అరకులోయ గిరిజన మ్యూజియానికి వచ్చిన పీవో.. ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
న్యాయమూర్తులు గిరిజన మ్యూజియంతోపాటు గిరి గ్రామదర్శినిని పరిశీలిస్తారని, అనంతగిరి హరిత హిల్ రిసార్ట్స్‌లో విశ్రాంతి తీసుకొన్న అనంతరం బొర్రాగుహలను సందర్శించి విశాఖపట్నం వెళ్తారని వివరించారు. స్థానిక గిరిజనుల స్థితిగతులను, ఇక్కడి పరిస్థితులను న్యాయమూర్తులు నేరుగా తెలుసుకొనే అవకాశముందని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. న్యాయమూర్తుల పర్యటన నేపథ్యంలో ఈనెల 12న గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శినిల్లోకి పర్యాటకులకు అనుమతి ఉండదని పీవో ప్రకటించారు.
సందర్శకుల తాకిడితో ఇరుకుగా మారుతోన్న అరకు
అరకు, మారేడుమిల్లిలో ఉత్సవాలు - ఆ వస్తువులపై నిషేధం విధించిన ప్రభుత్వం