Amit Shah Telangana Tour Schedule :పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా(Amit Shah) ఈ నెల 12న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు బీజేపీ మూడు వేల మందితో నిర్వహించే సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్(BJP Social Media Warriors) ఎట్లా పని చేయాలి, ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించేలా పోస్టులపై దిశా నిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశానంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో షా సమావేశం కానున్నారు. 25 వేల మంది బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు ఈ సమావేశానికి రానున్నారు. గ్రామాల్లో ప్రతి బూత్‌లో 370 ఓట్లు వచ్చేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులకు అమిత్ షా మార్గనిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 17 పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్(Lok Sabha Working Group)తో సమావేశమవుతారు. పార్లమెంట్ వర్కింగ్ గ్రూప్స్ సమావేశంలో భాగంగా దాదాపు ఐదు వందల మందితో సమావేశమై పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా పని చేయాలి, పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారు.
రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయి : అమిత్ షా