తెలంగాణ

telangana

ETV Bharat / politics

'అమిత్ షా వీడియో మార్ఫింగ్​ కేసు తెలంగాణకే పరిమితం కాదు' - Amit Shah Fake Video Case Update - AMIT SHAH FAKE VIDEO CASE UPDATE

Amit Shah Fake Video Case Investigation : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మార్ఫింగ్‌ వీడియో కేసులో మన్నె సతీశ్ తదితరులు పొందిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని దిల్లీ పోలీసులు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దాంతో పాటు అత్యవసరంగా విచారణకు ఆదేశించాలని కోరారు. పిటిషన్​ న్యాయవాది వాదనలు విన్న కోర్టు ఉత్తర్వులు సవరించేందుకు నిరాకరిస్తూ విచారణను జూన్ 12కి వాయిదా వేసింది.

TS HC on Amit Shah Morphing Video Case
Amit Shah Fake Video Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 10:18 AM IST

Amit Shah Fake Video Case Investigation : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మార్ఫింగ్‌ వీడియోకు సంబంధించిన కేసు తెలంగాణాకే పరిమితంకాదని దేశం నలుమూలలా వ్యాపించిందని రాష్ట్ర హైకోర్టుకు దిల్లీ పోలీసులు నివేదించారు. కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణతో పాటు నాగాలాండ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో పలువురికి సమన్లు జారీ అయినట్లు తెలిపారు. మన్నె సతీశ్ తదితరులు వాస్తవాలు దాచి కఠిన చర్యలు తీసుకోరాదంటూ ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారని వాటిని తొలగించడం సహా అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ దిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై దిల్లీ పోలీసుల తరఫున సృజన్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు.

Delhi Police Petition on Amit shah Case : పిటిషన్‌ వాదనలు వినిపించిన పోలీసుల తరపు న్యాయవాది దర్యాప్తులో భాగంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పిటిషనర్ల మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ నుంచి వీడియో ట్విటర్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ అయినట్లుందని, అందువల్ల వారికి నోటీసులు జారీ చేశామన్నారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించకపోవడంతో దిల్లీ పాటియాల కోర్టును ఆశ్రయించి మన్నే సతీశ్, నవీన్, కోయ గీతలపై నాన్ బేయిలబుల్ వారెంట్ పొందినట్లు తెలిపారు. ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి తేకుండా ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులు పొందారన్నారు.

అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసు - హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ - CONGRESS ON AMIT SHAH FAKE VIDEO

TS HC Investigation on Amit shah Video Case: కోయ గీత మొబైల్ ఫోన్ సీజ్ చేశామని అందులో కీలకమైన సమాచారం లభ్యమైందని పోలీసుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. అరుణ్ రెడ్డిని అరెస్ట్‌తో పలు సంచలన విషయాలు వెల్లడైనట్లు వివరించారు. రాష్ట్ర పోలీసులు ల్యాప్‌టాప్‌లు సీజ్ చేయడం వల్ల దర్యాప్తునకు ఇబ్బంది ఏర్పడుతోందని తెలంగాణాలో నమోదైన కేసును దిల్లీకి బదిలీ చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి దర్యాప్తుపై మధ్యంతర ఉత్తర్వులు లేనప్పుడు ఇబ్బంది ఏముంటుందని వ్యాఖ్యానించారు.

ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులను సవరించేందుకు నిరాకరిస్తూ విచారణను జూన్ 12కి వాయిదా వేశారు. దిల్లీ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు మన్నే సతీశ్​, ఆస్మా తస్లీం, శివకుమార్, నవీన్, కోయ గీత, వంశీ కృష్ణలు దాఖలు చేసిన పిటిషన్​లో కఠిన చర్యలు తీసుకోరాదంటూ గత వారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అమిత్‌ షా వీడియో మార్ఫింగ్ కేసు - కీలక విషయాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ - Amit Shah video morphing case

అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసు - వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ - amit shah video morphing case

ABOUT THE AUTHOR

...view details