ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఎన్నికల ప్రచారంలో సినీ నటి కుష్భూ- కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి - Actress KUSHBOO ELECTION CAMPAIGN - ACTRESS KUSHBOO ELECTION CAMPAIGN

Actress Kushboo Election Campaign: సినీ నటి, బీజేపీ మహిళా నేత కుష్బూ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, కొత్తపల్లి గీత తరఫున ప్రచారంలో పాల్గొని గెలిపించాలని కోరారు. దేశం అభివృద్ధి పథంలో వెళ్లాలంటే బీజేపీతోనే సాధ్యమని ఆమె అన్నారు.

Actress_Kushboo_Election_Campaign_in_AP
Actress_Kushboo_Election_Campaign_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:54 PM IST

Actress Kushboo Election Campaign: పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కుష్బూ ఓటర్లను కోరారు. అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్‌ తరఫున కసింకోట ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రాంతాలన్నీ అభివృద్ధి చేస్తానని సీఎం రమేష్‌ హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

'భూమి నీదే కానీ, మేం రిజిస్ట్రేషన్​ చేయించుకుంటాం- నీదైతే నిరూపించుకో!' - Land Titling Right Act

Kushboo Campaign with Kothapalli Geetha:అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కొత్తపల్లితో పాటూ కుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుష్బూ పర్యటన సందర్భంగా గిరిజన సంప్రదాయం నాట్యం దింసాతో ఘన స్వాగతం పలికారు. 1986లో ఏపీలో అరకు లోయను సందర్శించానన్న ఆమె ఇప్పటికీ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగినట్లు ఎక్కడా కానరాలేదన్నారు. ఈ నేపథ్యంలో అరకును అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు కొత్తపల్లి గీతను గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.

జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు: గంటా శ్రీనివాసరావు - Ganta Campaign in Bheemili

ప్రధాని మోదీ వికసిత్ భారత్ పేరుతో దేశ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారని, రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అరకు లోయలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆమె అన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు అరకులోయకు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశం అభివృద్ధి పథంలో వెళ్లాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు.

"రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుంది. వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి శూన్యం. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమిని గెలిపించాలి."- కుష్బూ, బీజేపీ మహిళానేత

పలకరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ- ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి - Brahmani election campaign

రాష్ట్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఏకమయ్యాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. దుర్మార్గపు పాలన పోవాలంటే గెలుపును కూటమికి పట్టం కట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రచారంలో సినీ నటి కుష్భూ- కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details