ఏకాగ్రతను పెంచుకోవడానికి చాలా మంది కష్టపడుతుంటారు. అయితే యాగాసనాలు ద్వారా ఏకాగ్రత శక్తిని పెంచుకోవచ్చు. ఏయే ఆసనాల ద్వారా ఏకాగ్రత పెంచుకోవచ్చో తెలుసుకుందాం.. తడాసనం(పర్వత భంగిమ)- కాళ్లు రెండూ దగ్గర ఉంచి. నిటారుగా నిల్చుని. అరిచేతులు రెండూ ఒకదానికి ఎదురుగా మరొకటి ఉండేలా పెట్టాలి. తడాసనం చేయటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.. వృక్షాసనం- ఒంటి కాలుపై నిల్చుని చేసే ఆసనం ఇది. ఒక కాలుని నేలపై ఆన్చి. మరో కాలుని రెండో కాలి తొడపై ఉంచాలి. చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. దీంతో దృష్టిని మెరుగుపరుచుకోగలుగుతారు.. పదంగుస్తాసనం- కింద కూర్చొని మీ కాళ్లను పైకి ఎత్తండి. ఆ తర్వాత చేతులను పైకి లేపి కాళ్లను పట్టుకొని ఊపిరి పీల్చుకోండి. పదంగస్తాసనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.. భుజంగాసనం- ఈ ఆసనం పాముని పోలి ఉండడం వల్ల దీన్ని భుజంగాసనం అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడును ఉత్తేజపరుస్తుంది. ఈ ఆసనం కాగ్రత. మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది.. విపరీత కరణి- గోడకు దగ్గరగా మొదట పడుకుని మీ కాళ్లను గోడపైకి పెట్టండి. అరచేతులు నేలపై ఉంచి మీ కళ్లు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టండి. దీని వల్ల నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది.