తెలంగాణ

telangana

ETV Bharat / photos

యాగి తుపాను బీభత్సానికి 233 మంది బలి - Vietnam Death Toll - VIETNAM DEATH TOLL

Vietnam Death Toll : వియత్నాంలో యాగి తుపాను విలయాన్ని సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 233కు చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఉత్తర లావో కై ప్రావిన్స్‌ లోని లాంగ్​ను గ్రామంలో మంగళవారం మరో 48 మృతదేహాలను వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. బురదలో చిక్కుకున్నవారు, వరదల్లో కొట్టుకుపోయినవారి జాడ కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తోంది. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 1:07 PM IST

వియత్నాంలో యాగి తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో తుపాను కారణంగా మరణించినవారి సంఖ్య శుక్రవారానికి 233కు చేరింది. మరో 800 గాయపడ్డారు. (Associated Press)
ఉత్తర లావో కై ప్రావిన్స్​లోని లాంగ్​ను గ్రామంలో కొండచరియలు కింద చిక్కుకున్న, వరద నీటిలో కొట్టుకుపోయిన మరో 48 మృతదేహాలను వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. (Associated Press)
తప్పిపోయిన మరో 39 మంది కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దశాబ్ద కాలంలో వియత్నాంను వణికించిన అత్యంత బలమైన తుపాను యాగి. (Associated Press)
యాగి తుపాను శనివారం తీరం దాటే సమయంలో గంటకు 149 కి.మీ వేగంతో గాలులు వీచింది. ఆదివారం నాటికి యాగి తుపాను బలహీనపడినప్పటికీ, కుండపోత వర్షాలు పడ్డాయి. (Associated Press)
దీంతో నదులు, లాంగ్ నూ గ్రామానికి వెళ్లే రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. (Associated Press)
స్నిఫర్ డాగ్​లతో దాదాపు 500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. (Associated PressAssociated Press)
గురువారం ఘటనాస్థలిని వియత్నాం ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్హ్ సందర్శించారు. అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించారు. (Associated Press)
శిథిలాలు, వరదల్లో కొట్టుకునిపోయినవారి కోసం రాజీపడకుండా వెతుకుతామని వియత్నాం ప్రధాని హామీ ఇచ్చారు. బాధితుల కుటుంబాలు ఆవేదనలో ఉన్నాయని పేర్కొన్నారు. (Associated Press)
కాగా, లాంగ్ నూ గ్రామానికి చెందిన ఎనిమిది సురక్షితంగా ఉన్నట్లు వియత్నాం స్థానిక మీడియా పేర్కొంది. (Associated Press)
వారందరూ గ్రామానికి వరద నీరు పోటెత్తిన సమయంలో వేరే చోట ఉన్నట్లు తెలిపింది. (Associated Press)
వియత్నాం వరదలు (Associated Press)
వియత్నాం వరదలు (Associated Press)
వియత్నాం వరదలు (Associated Press)
వియత్నాం వరదలు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details