తెలంగాణ

telangana

ETV Bharat / photos

ట్రంప్ కిస్​ మిస్​- ఫుల్​ జోష్​తో మస్క్ స్టెప్పులు- HD ఫొటోస్​ చూశారా? - TRUMP INAUGURATION PHOTOS

Donald Trump Inauguration Photos : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్‌ డీసీ క్యాపిటల్‌ హిల్‌ భవనంలో ట్రంప్​తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ భార్యాపిల్లలు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు, ఎలాన్‌ మస్క్‌ తదితరులు హాజరయ్యారు. ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలోని కొన్ని ఫొటోలు చూసేద్దాం పదండి. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2025, 12:09 PM IST

Updated : Jan 21, 2025, 3:21 PM IST

ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం ఫొటో గ్యాలరీ (Associated Press)
అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ముందు డొనాల్డ్ ట్రంప్ దంపతులు వైట్ హౌస్ కు వెళ్లగా, అక్కడ జో బైడెన్ దంపతులు వారికి ఘన స్వాగతం పలికారు. (Associated Press)
వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలోని రోటుంటా సముదాయంలోకి ప్రవేశిస్తున్న డొనాల్ట్ ట్రంప్ (Associated Press)
అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్​తో డొనాల్డ్ ట్రంప్ ముచ్చట్లు (Associated Press)
వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ భవనంలోని రోటుంటా సముదాయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​తో డొనాల్డ్ ట్రంప్ (Associated Press)
ట్రంప్ ప్రమాణానికి హాజరైన వ్యాపార దిగ్గజాలు మార్క్ జుకర్‌ బర్గ్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్ (Associated Press)
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరైన అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ (Associated Press)
వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటర్ భవనంలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Associated Press)
రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా హాజరైన అతిథులు, వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజాలు (Associated Press)
అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకారానికి ముందు తన భార్య మెలానియా ట్రంప్‌ ను ముద్దాడుతున్న డొనాల్డ్ ట్రంప్ (Associated Press)
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ దంపతులు (Associated Press)
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ (Associated Press)
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందంగా ముస్తాబైన వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం (Associated Press)
ట్రంప్ ప్రమాణానికి హాజరైన అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే, మాజీ హౌస్ స్పీకర్ కెవిన్ మెకార్తీ (Associated Press)
వైట్ హౌస్​లో కమలా హారిస్, జేడీ వాన్స్ దంపతులు (Associated Press)
ట్రంప్ ప్రమాణానికి హాజరైన టిక్‌ టాక్ సీఈఓ షౌ జి చ్యూ (Associated Press)
వాషింగ్టన్​లోని సెయింట్ జాన్స్ చర్చిలో ట్రంప్, జేడీ వాన్స్ దంపతుల ప్రార్థనలు (Associated Press)
2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై జరిపిన దాడుల్లో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (AP)
వాషింగ్టన్‌ లో జరిగిన ఇండోర్ ప్రెసిడెన్షియల్ పరేడ్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (AP)
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత వెళ్లిపోతున్న ట్రంప్ దంపతులు (Associated Press)
ఇండోర్ ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్ పరేడ్​లో ప్రసంగించిన ఎలాన్ మస్క్, సరదాగా స్టెప్పులు వేసిన టెస్లా అధినేత (Associated Press)
Last Updated : Jan 21, 2025, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details