తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఉన్నది ఆరుగురు ఓటర్లే - ట్రంప్​, హారిస్​కు చెరో 3 ఓట్లు - యూఎస్​ ఎలక్షన్ ఫస్ట్ రిజల్ట్ ఇదే!

Dixville Notch Election Result 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న వేళ, అక్కడ చిన్న పట్టణమైన డిక్స్​విల్లే నాచ్​ ఎలక్షన్​ ఫలితాలు వెలువడ్డాయి. న్యూహాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ చెరో 3 ఓట్లను దక్కించుకున్నారు. దీనితో ఫలితం టై అయ్యింది. వాస్తవానికి డిక్స్‌విల్లేలో ఉన్నవి కేవలం ఆరు ఓట్లు మాత్రమే. (APTN)

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 7:21 PM IST

న్యూహ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌ అనే చిన్న పట్టణానికి చాలా ప్రత్యేకత ఉంది. అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా తొలి ఓటు వేసే అవకాశం వారికే దక్కుతుంది. (APTN)
డిక్స్‌విల్లే నాచ్‌ అమెరికా-కెనడా సరిహద్దులో ఉంది. అక్కడ ఆరుగురు ఓటర్లు ఉన్నారు. (APTN)
నలుగురు ఓటర్లు రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఓటు నమోదు చేసుకున్నారు. మరో ఇద్దరు మాత్రం ఏ పార్టీ తరఫున నమోదు చేసుకోలేదు. (APTN)
ఎలక్షన్‌ రోజు వీరంతా స్థానిక బాల్‌సామ్స్‌ హోటల్‌లో సమావేశమై, జాతీయ గీతం ఆలపించిన తర్వాత తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. (APTN)
అందరూ ఓటేసిన 15 నిమిషాల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. (APTN)
డక్స్‌విల్లే నాచ్‌లో 1960 నుంచి అర్ధరాత్రి ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయం కొనసాగుతోంది. ఈసారి కూడా అర్థరాత్రి 12 దాటగానే ఆరుగురు ఓటేశారు. (APTN)
ఓటింగ్ పూర్తికాగానే ఎన్నికల అధికారులు ఓట్లను లెక్కించారు. (APTN)
మొత్తం ఆరు ఓట్లలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ కు మూడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు 3 ఓట్లు వచ్చాయని ప్రకటించారు. దీనితో ఫలితం టై అయ్యింది. (APTN)

ABOUT THE AUTHOR

...view details