తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఏనుగుపై మోదీ సవారీ- కెమెరాతో ఫొటోలు- కజిరంగ అందాలను వీక్షించాలన్న ప్రధాని

PM Modi Elephant Safari : ప్రధాని నరేంద్రమోదీ అసోం పర్యటనలో భాగంగా కజిరంగ జాతీయ పార్క్​ను సందర్శించారు. అక్కడ ఏనుగుపై సవారీ చేశారు. ఆ తర్వాత జీపులో సఫారీకి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్‌ కొహోరారేంజ్‌ను సందర్శించిన ప్రధాని మోదీ ఈ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువుల చిత్రాలను కెమెరాలో బంధించారు. ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్‌ పార్క్‌ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు.

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 10:25 AM IST

Updated : Mar 9, 2024, 3:26 PM IST

PM Modi Elephant Safari : ప్రధాని నరేంద్ర మోదీ ఏనుగుపై సవారీ చేశారు. అసోంలోని కజిరంగ జాతీయ పార్కు సందర్శించిన ఆయన ఏనుగెక్కి ప్రకృతి అందాలను వీక్షించారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆ పార్కులో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని సెంట్రల్‌ కొహోరా రేంజ్‌లోని మిహిముఖ్‌ ప్రాంతంలో మొదట ఏనుగు అంబారీ ఎక్కారు.
తర్వాత అదే రేంజ్‌లో జీపు సఫారీ చేశారు.
అప్పుడు పార్క్​ డైరక్టర్‌తో పాటు సీనియర్‌ అధికారులు మోదీతో ఉన్నారు.
కజిరంగ పార్క్​లోని ప్రకృతి అందాలను, జంతువుల చిత్రాలను కెమెరాలో బంధించారు.
సఫారీ అనంతరం ఏనుగులకు చెరకు గడలను తినిపించారు.
అలాగే మహిళా ఫారెస్ట్‌ గార్డ్‌లతో ప్రధాని ముచ్చటించారు.
ఈ చిత్రాలను మోదీ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.
ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్‌ పార్క్‌ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు.
కజిరంగ పార్క్​లో ప్రధాని నరేంద్ర మోదీ
కజిరంగ పార్క్​లో ప్రధాని నరేంద్ర మోదీ
మరోవైపు, అసోంలోని టీ గార్డెన్​ను కూడా సందర్శించారు ప్రధాని మోదీ.
అసోం అభివృద్ధిలో వీరు ముఖ్యపాత్రి పోషిస్తున్నారని, రాష్ట్ర ప్రతిష్ఠను విశ్వ వ్యాప్తం చేస్తున్నారని ప్రశంసించారు.
పర్యటకులు అసోంకు వచ్చినప్పుడు టీ గార్డెన్లను సందర్శించాలని కోరారు.
Last Updated : Mar 9, 2024, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details