తెలంగాణ

telangana

ETV Bharat / photos

అక్షర సేద్యంలో అలుపెరగని అడుగులు - ఈనాడు పత్రిక ద్వారా వేలమంది పాత్రికేయులు - Ramoji Rao Eenadu Paper - RAMOJI RAO EENADU PAPER

History of Ramoji Rao : తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది 'ఈనాడు'. 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన 'ఈనాడు' దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం. అణువణువు కొత్తదనంతో, ప్రజల పక్షాన అక్షరయుద్ధంతో ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. జాతీయ స్థాయిలోనూ మీడియా పాత్రపై ఆయన అలుపెరగని పోరాటం చేశారు. (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 2:11 PM IST

అక్షర సేద్యంలో అలుపెరగని అడుగులు (ETV Bharat)
తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది 'ఈనాడు'. 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన 'ఈనాడు' దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం. (ETV Bharat)
అణువణువు కొత్తదనంతో, ప్రజల పక్షాన అక్షరయుద్ధంతో ప్రారంభించిన 4ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారింది. (ETV Bharat)
ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. (ETV Bharat)
వార్తాపత్రిక డోర్‌ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం. (ETV Bharat)
అప్పటివరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణానికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. (ETV Bharat)
మారుమూల ప్రాంతాలవారైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకో, మరుసటి రోజు ఉదయం వరకో వేచి చూడాల్సిందే. (ETV Bharat)
అలాంటి ఇబ్బంది లేకుండా రోజూ సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు. (ETV Bharat)
ఇతర వార్తాపత్రికలు ఇదే విధానాన్ని అవలంబించడం ప్రారంభించాయి. (ETV Bharat)
జిల్లా సంచికలు తీసుకురావాలన్న ఆలోచన రామోజీరావుదే. (ETV Bharat)
సగటు పాఠకుడు తనచుట్టూ జరిగే చిన్నచిన్న ఘటనల్ని సైతం తెలుసుకునేందుకు వీలు కల్పించాలన్నదే ఆయన అభిమతం. (ETV Bharat)
తర్వాతికాలంలో నియోజకవర్గ పేజీల్ని ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు పెద్దపీట వేశారు. (ETV Bharat)
అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చో 'ఈనాడు ముందడుగు' ద్వారా సామాన్యులకు తెలియచెప్పారు. (ETV Bharat)
స్వచ్ఛభారత్‌, సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం, జలసంరక్షణ కోసం ఊరూవాడను ఏకం చేశారు. (ETV Bharat)
రామోజీరావు విజయయాత్రలో ఈనాడుతోపాటు కీలక మైలురాళ్లుగా నిలిచాయి సితార సినీపత్రిక, చతుర, విపుల సాహితీ పత్రికలు (ETV Bharat)
ఈనాడు దిల్లీ ఎడిషన్ లాంచ్ చేస్తున్న రామోజీరావు (11-10-2002) (ETV Bharat)
కరీంనగర్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రింటింగ్ మెషిన్ స్విచాన్ చేస్తున్న రామమోహనరావు (30–03–1992) (ETV Bharat)
ఈనాడు సంస్థ ఉద్యోగులతో రామోజీ రావు (ETV Bharat)
ఈనాడు పేపర్​ను పరిశీలిస్తున్న రామోజీ రావు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details