Health Benefits Of Cycling : ప్రతిరోజూ సైక్లింగ్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలోని అధిక కొవ్వు తగ్గుతుంది. సైక్లింగ్ వల్ల జీవక్రియలు కూడా మెరుగుపడతాయి. కండరాలు బలంగా తయారవుతాయి.. సైక్లింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సైక్లింగ్ కాలు కండరాల బలాన్ని పెంచుతుంది. అంతేగాక ఫిట్ గా ఉంటారు. వ్యాయమంలో సైక్లింగ్‌ను భాగం చేసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.. సైక్లింగ్ వల్ల గుండె. ఊపిరితిత్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. గుండె పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. సైక్లింగ్ ఒత్తిడి. నిరాశ. ఆందోళన నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది.