బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయ హల్వా వేడుక బుధవారం జరిగింది. దిల్లీలోని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయమైన నార్త్ బ్లాక్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.. ఈ వేడుకలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సహాయ మంత్రి డాక్టర్ భగవంత్ కిషన్రావ్ కారాడ్. సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఏటా ఆర్థిక శాఖ ఆనవాయితీగా నిర్వహిస్తోంది.. ప్రతిసారి బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో 'హల్వా వేడుక' నిర్వహిస్తారు. ఇందుకు ఓ కారణం కూడా ఉంది.. బడ్జెట్ సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించరు. ఆర్థిక శాఖకు చెందిన కొందరు సిబ్బంది ఈ క్రతువులో పాల్గొంటారు.. బడ్జెట్ సమర్పించడానికి పదిరోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్‌మెంట్‌లో జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండి పోతారు.. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను చేస్తారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు.. బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు.. బంధువులకు కూడా ఫోన్ చేసుకొనే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ చేసుకోవచ్చు.