తెలంగాణ

telangana

ETV Bharat / photos

అనార్కలీ టు షరారా - రంజాన్ పండుగకు మీరు ఈ లుక్స్​ ట్రై చేసి చూడండి! - EID Special Ethnic Wear - EID SPECIAL ETHNIC WEAR

EID Special Ethnic Wear : రంజాన్ వచ్చేసింది. ఇక పండుగ అంటేనే స్వీట్స్​, కొత్త బట్టలు కచ్చితంగా ఉండాల్సిందే. మరీ ఈ పండుగను మరింత కలర్​ఫుల్​గా జరుపుకునేందుకు ఈ సెలబ్రిటీ లుక్​ను ఓ సారి ట్రై చేసి చూడండి.

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 9:57 AM IST

EID Special Ethnic Wear : రంజాన్ పండుల వేళ ఈ ట్రెండీ ఔట్​ఫిట్స్​ను మీరు ఓ సారి ట్రై చేయండి మరి ?
పింక్, మెరూన్, గ్రీన్​, నావీ బ్లూ ఇలా పలు కలర్స్​లో సింపుల్ బార్డర్ పట్టు శారీ ట్రై చేయండి. దానికి హెవీ జ్యూవెలరీ ధరిస్తే మీ ఫెస్టివ్ లుక్​ను మరింత అట్రాక్టివ్​గా చేస్తుంది.
ఈ ఫొటోలో ప్రియాంక చోప్రా వేసుకున్నట్లు జరీ వర్క్​, బీడ్స్​, భారీ ఎంబ్రాయడరీ ఉన్న లెహంగాను ట్రై చేయండి. దానికి సింపుల్​గా నగలు ధరించి చూడండి. ఇక ఈ వేడుకలో మీరే స్పెషల్​గా నిలుస్తారు.
ఆలియా వేసుకున్నఈ పింక్ షరారా (Sharara) మోడల్ డ్రెస్​ ఓ సారి ట్రై చేయండి. ఈ లుక్​ వల్ల మీరు సింపుల్​గా ఉంటూనే మరింత అట్రాక్టివ్​గా కనిపిస్తారు. దీనికి ఎటువంటి జ్యూయెలరీ కూడా అక్కర్లేదు.
ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెండ్ సెట్ చేస్తూ దూసుకెళ్తోంది అనార్కలీ మోడల్ డ్రెస్​. మాధురి దీక్షిత్​ వేసుకున్న ఈ సింపుల్ అనార్కలీ డ్రెస్​ను మీరూ ఓ సారి ట్రై చేయండి.
మీరు సింపుల్​గా ఉండేందుకు ఇష్టపడేవారైతే కరీనా వేసుకున్న ఈ సింపుల్ అండ్ స్టైలిష్​ ప్లాజో కుర్తి ట్రై చేయండి. దీంతో పాటు భారీ ఇయర్ రింగ్స్​ బాగా సెట్ అవుతాయి.

ABOUT THE AUTHOR

...view details