అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించినప్పటి నుంచి రోజుకో రకంగా నిర్వాహకులు అలంకరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నేసిన వస్త్రాన్ని ప్రత్యేకంగా తీసుకెళ్లి అయోధ్య బాలరాముడికి అలంకరించారు. దుబ్బాక చేనేత కార్మికులు మగ్గం ద్వారా నేసిన లెనిన్ ఇక్కత్ వస్త్రాన్ని వాడారు. ఐదు చేనేత మగ్గాలపై ఐదుగురు కార్మికులు లెనిన్ వస్త్రాన్ని గులాబీ రంగులో ఉన్న దారంతో తయారు చేశారు. (ETV Bharat)