తెలంగాణ

telangana

వయనాడ్​ విలయానికి 184 మంది బలి- అదానీ రూ.5 కోట్ల సాయం - wayanad landslide 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 6:30 PM IST

Wayanad Landslide 2024 : కేరళ వయనాడ్ జిల్లాలో కొండచరియల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. గల్లంతైన వారి కోసం సైన్యం, నేవీ, NDRF బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. బాధితులను వెలికి తీసేందుకు జాగిలాలను సైతం సైన్యం రంగంలోకి దింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 184కు పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర మంత్రి ఖురియన్ తెలిపారు. (Assosiated Press)
కేరళ వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. 200 మంది గాయపడగా ఇంకా అనేక మంది ఆచూకీ తెలియడంలేదని కేరళ రెవెన్యూ శాఖ వర్గాలు ప్రకటించాయి. (Assosiated Press)
కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య 184కు పెరిగింది. (Assosiated Press)
పిల్లలు, గర్బిణులు సహా మరో 8,017 మందిని 82 సహాయ శిబిరాలకు తరలించారని కేరళ ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. 5,592 మందిని కొండచరియల నుంచి రక్షించారు. (Assosiated Press)
వయనాడ్‌లో సైన్యం, నావికాదళం, NDRF బృందాలు సంయుక్తంగా సహాయ చర్యలు చేపట్టాయి. పడిపోయిన చెట్లు, బురదను తొలగిస్తూ ముందుకు సాగుతున్నాయి. పూర్తిగా కొండ ప్రాంతం కావడం వల్ల సహాయచర్యలకు ప్రతికూలంగా మారాయి. (Assosiated Press)
కేరళ ప్రభుత్వం విజ్ఞప్తితో సదరన్ నేవల్ కమాండ్‌ కూడా సహాయ చర్యల కోసం 68 మందితో కూడిన బృందాన్ని పంపింది. వివిధ పరికరాలతో వైద్యులతో కూడిన బృందం ఘటనా స్థలికి చేరుకుని, సహాయచర్యల్లో పాల్గొంది. (Assosiated Press)
తాత్కాలిక వంతెనలు నిర్మిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇందుకోసం 110 అడుగుల బెయిలీ వంతెనను దిల్లీ నుంచి విమానంలో వయనాడ్‌కు తరలించారు. బురదలో చిక్కుకున్నవారిని వెలికి తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. (Assosiated Press)
పొక్లెయిన్లతో భారీ మట్టిమేటలు తొలగిస్తున్నారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్లలో తరలిస్తున్నారు. కొన్ని మృతదేహాలు కొండచరియలు విరిగిపడిన చోటుకు దాదాపు 20 కిలోమీటర్ల అవతల దొరికినట్లు NDRF సిబ్బంది చెప్పారు. (Assosiated Press)
వయనాడ్‌ విషాదంపై అదానీ గ్రూప్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబసభ్యులకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు. (Assosiated Press)
ఈ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేరళ ప్రభుత్వంపై ఆరోపణలు చేయగా, సీఎం విజయన్ స్పందించారు. (Assosiated Press)
కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయన్న విషయంపై కేరళను ముందే హెచ్చరించామని స్పష్టం చేశారు హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. (Assosiated Press)
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వ్యాఖ్యలపై స్పందించారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​. ఇలాంటి ఆరోపణలకు ఇది సమయం కాదని చెప్పారు. విపత్తుకు ముందు ఎలాంటి రెడ్​ అలర్ట్​లు జారీ చేయలేదని తెలిపారు. (Assosiated Press)
రోదిస్తున్న బాధితుడు (Assosiated Press)
సహాయక చర్యల్లో పాల్గొన్న ఆర్మీ విమానం (Assosiated Press)

ABOUT THE AUTHOR

...view details