తెలంగాణ

telangana

ETV Bharat / photos

చిలీలో కార్చిచ్చు విధ్వంసం- 19 మంది మృతి- బూడిదైన వేల ఎకరాలు - చిలీలో కార్చిచ్చు

Chile Forest Fire 2024 : కార్చిచ్చుల ధాటికి కొలంబియాలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కార్చిచ్చులు చెలరేగాయి. అనేక ఇళ్లు, వాహనాలు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 10:53 PM IST

దక్షిణ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు వ్యాపించిన మంటలు ఇప్పటివరకు 19 మందిని బలితీసుకున్నాయి.
దేశంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉంది. కార్చిచ్చు ధాటికి 1,100 ఇళ్లు పూర్తిగా నాశనం అయ్యాయని అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 92 కార్చిచ్చులు చెలరేగినట్లు చిలీ హోంమంత్రి కరోలీనా తోహా తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగినట్లు చెప్పారు.
క్విల్​ప్యూ, విల్లా అలేమాన ప్రాంతాల్లో చెలరేగిన రెండు కార్చిచ్చులు ఏకంగా 19,770 ఎకరాలను దహించివేసిందని తోహా వివరించారు.
వాల్​పారైసో ప్రాంతంలో కార్చిచ్చు అత్యంత తీవ్రంగా ఉంది. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అగ్నిమాపక దళాలు, అంబులెన్సులు, అత్యవసర వాహనాలు సులభంగా తిరగగలిగేలా ప్రజలు సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తీవ్రత అధికంగా ప్రదేశాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వాల్​పారైసో ప్రాంతంలో మూడు సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.
ఘటనాస్థలికి చేరుకునేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని మంత్రి తోహా వివరించారు.
19 హెలికాప్టర్లు, 450 మందికి పైగా అగ్నిమాపక దళ సిబ్బంది ఈ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి మంటలు అదుపు చేశారని మంత్రి స్పష్టం చేశారు.
ఎల్​ నినో ప్రభావం వల్ల దక్షిణ అమెరికా ఖండంలో కరవు తాండవిస్తోంది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఫలితంగా దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో కార్చిచ్చులు సంభవిస్తున్నాయి.
జనవరిలో కొలంబియాలో చెలరేగిన కార్చిచ్చులకు 42 వేల ఎకరాల అటవీ ప్రాంతం బూడిదైంది.
కార్చిచ్చు ధాటికి కాలి బూడిదైన కార్లు, ఇళ్లు

ABOUT THE AUTHOR

...view details