9ఏళ్ల తర్వాత గేదెలు, పక్షుల పందేలు- భారీగా తరలివచ్చిన గ్రామస్థులు - గేదెల పందేలు 20243
Assam Bird And Buffalo Fights : సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో జరిగిన కోడి పందేల్లా అసోంలో గేదెలతోపాటు పక్షుల పందేలు జరిగాయి. భారీ సంఖ్యలో ప్రేక్షకులు అక్కడికి చేరుకుని పందేలను చూశారు.
మన దగ్గర కోడి పందేలు ఎంత ఫేమస్సో అసోంలో గేదెల పందేలు, పక్షుల పందేలు కూడా అంతే ఫేమస్.ప్రతి ఏటా సంక్రాంతి వేళ అక్కడి సంస్కృతి ప్రకారం రెండు గేదెలను బరిలోకి దింపి వాటికి పోటీ పెడతారు. ఆ విధంగానే పక్షులను కూడా అలానే దింపుతారు.సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత ఈ ఏడాది అసోంలో పందేలు జరిగాయి. వన్యప్రాణి హక్కుల కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ మాగ్ బిహు పండుగ సందర్భంగా భారీగా గేదెలు పందేలు, పక్షుల పందేలు జరిగాయి.రాజధాని గువాహటి శివారల్లోని ఓ ఆలయ ఆవరణలో గేదెలు కొమ్ములతో కొట్టుకున్నాయి.పక్షులు తమ ప్రత్యర్థి పక్షులపైకి దూసుకెళ్లాయి.ముగ్గురు వ్యక్తులు న్యాయమూర్తులుగా వ్యవహరించి విజేత యజమానికి బహుమతి రూ.3000 అందించారు.అయితే పక్షుల పందేలు సురక్షితంగా జరిగాయని నిర్వాహకుడు భరాలీ తెలిపారు. 50 కుటుంబాలు చెరో రెండు పిట్టలను తీసుకొచ్చాయని తెలిపారు.
ఐదు నుంచి పది నిమిషాల జరిగే పందేం తర్వాత పక్షులు గాయపడవని, కేవలం అలిసిపోతాయని చెప్పారు.2014లో సుప్రీంకోర్టు ఇలాంటి పందేలపై నిషేధం విధించింది. కానీ గతేడాది ఆచారాలను పునరుద్ధరించేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కొత్త చట్టాలపై సంతకం చేసింది. దీంతో ఈ ఏడాది మళ్లీ ఈ పందేలు జరిగాయి.అసోంలో 18వ శతాబ్దం నుంచి ఈ పందేలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు పండుగ సీజన్‌కు ముందే అడవి పక్షులను పట్టుకుని శిక్షణ ఇస్తారు. పందేలు అయిపోయాక విడిచిపెట్టేస్తారు.చట్టం ప్రకారం, పక్షుల ఆహారంతోపాటు నీరు అందించాలి. పందేం ముగిశాక సురక్షితంగా విడిచిపెట్టాలి. నిర్వాహకులు నిబంధనలను పాటించడంలో విఫలమైతే పందేలను ఐదేళ్లపాటు నిషేధిస్తుంది ప్రభుత్వం.చట్టం ప్రకారం, గేదెల పందేలు జరిగే చోటుకు పశువైద్య బృందాలు చేరుకోవాలి. జంతువులకు ఇబ్బంది కలిగితే వెంటనే చికిత్స చేయాలి.ఈ పందేలు ఒక రకమైన హింస అని జంతు సంరక్షణ కార్యకర్త ముబినా అక్తర్ అన్నారు. అడవిలో పక్షులను పట్టుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.రాష్ట్రంలో గేదెల, పక్షుల పందేలను తక్షణమే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జంతు హక్కుల పరిరక్షణ సంస్థలు కోరాయి.గేదెల పందెం