ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / photos

కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఫ్యాన్- నిలిచి గెలిచిన తెలుగుదేశం - ap election results 2024 - AP ELECTION RESULTS 2024

AP Election Results 2024: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సునామీ సృష్టించింది. వైఎస్సార్సీపీకి కోలేకోలేని దెబ్బ కొట్టింది. జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్​ చేసి చరిత్ర సృష్టించింది. కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ కొట్టుకుపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఆధిక్యంతో చరిత్రాత్మక విజయాన్ని కూటమి తన ఖాతాలో వేసుకుంది. జిల్లాల వారీగా ఫలితాలివి. (AP_Election_Results_2024)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 7:36 PM IST

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించిన టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో 6 సీట్లను దక్కించుకుంది. (AP_Election_Results_2024)
ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేయగా ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ 5 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. (AP_Election_Results_2024)
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో 4 సీట్లను కైవసం చేసుకున్న టీడీపీ ప్రస్తుతం 9 స్థానాల్లో విజయం సాధించింది. (AP_Election_Results_2024)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ స్థానాల్లో 2014 ఎన్నికల్లో 4 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో 12 స్థానాల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. (AP_Election_Results_2024)
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ స్థానాల్లో 2019 ఎన్నికల్లో 4 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో 12 స్థానాల్లో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. (AP_Election_Results_2024)
2019 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ స్థానాల్లో 2 సీట్లను గెలుచుకున్న టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో 12 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. (AP_Election_Results_2024)
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజవర్గాలు ఉండగా గతంలో కేవలం 2 స్థానాలను మాత్రమే టీడీపీ దక్కించుకుంది. అయితే ఈసారి మాత్రం 16 స్థానాల్లో గెలుపొంది విజయకేతనం ఎగురవేసింది. (AP_Election_Results_2024)
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం 4 సీట్లను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం 7 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. (AP_Election_Results_2024)
2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజవర్గాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ 7 స్థానాల్లో పసుపు జెండా ఎగురవేసింది. (AP_Election_Results_2024)
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో టీడీపీ ఒకే ఒక సీటుతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో 8 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. (AP_Election_Results_2024)
వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈసారి మాత్రం టీడీపీ 4 స్థానాల్లో పసుపు జెండా ఎగురవేసింది. (AP_Election_Results_2024)
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో 12 సీట్లతో సరిపెట్టుకుంది (AP_Election_Results_2024)
గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా వాటిలో కేవలం 2 సీట్లను మాత్రమే గెలుచుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో 9 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. (AP_Election_Results_2024)

ABOUT THE AUTHOR

...view details