తెలంగాణ

telangana

ETV Bharat / photos

మహాకుంభ్​లో 10కోట్ల మందికిపైగా పుణ్య స్నానాలు - PRAYAGRAJ KUMBHMELA DEVOTEES NUMBER

10 Crore Pilgrims Bathed In MahaKumbh : మహాకుంభ మేళాలో జనవరి 13 నుంచి గురువారం మధ్యాహ్నం 12గంటల వరకు(11 రోజుల్లో) త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 10కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. గురువారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు దాదాపు 30లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని తెలిపింది. వీరిలో 10లక్షల మంది కల్పవాసీలు, ఇతర భక్తులు కూడా ఉన్నట్లు పేర్కొంది. (Getty Images, ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2025, 4:43 PM IST

మహాకుంభ మేళా వేళ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌ భక్తిభావంతో పులకించిపోతోంది. పెద్దసంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. (Getty Images)
ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణీ సంగమంలో గత 11 రోజుల్లో 10 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఈవిషయాన్ని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వెల్లడించింది. (ETV Bharat)
గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని యూపీ సర్కారు తెలిపింది. (Getty Images)
మహాకుంభ మేళాలో భాగంగా మకర సంక్రాంతి రోజున అత్యధికంగా 3.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. పుష్య పూర్ణిమ రోజున మరో 1.7 కోట్ల పుణ్యస్నానాలు చేశారు. (ETV Bharat)
అంటే ఆ రెండు రోజుల్లోనే దాదాపు 5.2 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమానికి వచ్చారు. (ETV Bharat)
జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. (ETV Bharat)
ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాల కోసం ప్రయాగ్ రాజ్‌కు వస్తారని యూపీ సర్కారు అంచనా వేస్తోంది. (ETV Bharat)
గంగ, యమున, సరస్వతీ నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణీ సంగమం అంటారు. ఇది ప్రయాగ్ రాజ్‌లో ఉంది. (ETV Bharat)
మహాకుంభ మేళాతో ప్రయాగ్ రాజ్‌లో వివిధ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. వీటివల్ల ఎంతో మంది ఉపాధి లభిస్తోంది. లాడ్జీలు, పూజా సామగ్రి, పూలు, భోజనశాలలకు మంచి గిరాకీ ఉంటోంది. (ETV Bharat)
కుంభమేళాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సాధువులు (ETV Bharat)
మహాకుంభ్​లో గంగా హారతి (Getty ImagETV Bharates)

ABOUT THE AUTHOR

...view details