Pratidwani :రాష్ట్రంలోని బ్యారేజీలు, సాగునీటి ప్రాజెక్టులు ఎంతవరకు భద్రం? ఇటీవల బెజవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొన్న ఘటన రేకెత్తించిన ప్రశ్న ఇది. అది ప్రమాదం కాదు పనిగట్టుకుని చేసిన కుట్ర అని స్పష్టమవుతునే ఉంది. కానీ అదే సమయంలో ఐదేళ్లుగా కనీస నిర్వహణ కూడా పట్టించుకోకుండా వదిలేయడంతో మిగిలిన ప్రాజెక్టులన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి? అసలు సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఎలాంటి భద్రతా ప్రమాణాలు ఉండాలి? ఐదు సంవత్సరాలుగా ఆ విషయంలో ఏం జరిగింది? ఎంత నష్టం చేశారు? ఫలితంగా ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కొంటున్నాం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఛీఫ్ ఇంజినీర్ డి. రామకృష్ణ, సాగునీటి సంఘాల సమాఖ్య ఆళ్ల గోపాలకృష్ణ పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వరదలకు డ్యాంలు కొట్టుకుపోయినప్పుడో నీటి తాకిడికి ప్రాజెక్ట్ గేటులు తెగిపోయినప్పుడో హడావుడిగా సమీక్షలు చేయడం ఆ తర్వాత దాన్ని మర్చిపోతారు. దీన్ని ఫలితంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు ఎన్ని సార్లు జగన్ ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదు.
వైసీపీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ప్రాజెక్ట్‌లు - మరమ్మతులు లేక కొట్టుకుపోతున్న గేట్లు