ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

విచ్చలవిడిగా వైసీపీ నేతల భూఆక్రమణలు - కన్ను పడితే చాలు స్థలం కబ్జానే ? - YCP Leaders Land Grabs

Pratidwani Debate on YCP Leaders Land Grabs: రాష్ట్రంలో చేనును కంచె తినేసినట్లు పాలకులే కబ్జాదారులవుతున్నారు. చెమట చిందించి కొనుక్కున్న ఆస్తుల్ని సైతం పెత్తందార్లు మింగేస్తుంటే ఎదిరించే ధైర్యం లేక ప్రాణాలను సైతం విడుస్తున్నారు. రక్షకులుగా ఉండాల్సిన వాళ్లే భక్షకులుగా మారితే జనం ఏం చేయాలో నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

YCP Leaders Land Grabs and Illegalities
YCP Leaders Land Grabs and Illegalities

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 10:11 AM IST

YCP Leaders Land Grabs and Illegalities: కంచే చేను మేసినట్లు పాలకులే కబ్జాకోరులైతే ? ప్రజల ధన, మాన, ప్రాణాల్ని కాపాడాల్సిన వారే ముప్పుగా వాటిల్లితే ? చెమట చిందించి కొనుక్కున్న ఆస్తుల్ని పెత్తందార్లు మింగేస్తుంటే ? అరాచక మూకను ఎదుర్కొనే శక్తి లేక సర్వస్వాన్ని లాక్కున్న గుంట నక్కలతో కొట్లాడే ధైర్యం చాలక బతుకుపై ఆశలు కోల్పోయి, ప్రాణాలు తీసుకునే దుస్థితి దాపురించండం ఎంత దారుణం ? ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో విశృంఖలంగా సాగుతున్న ఈ దురాగతాలకు చెక్ చెప్పడం ఎలా ? రక్షకులుగా ఉండాల్సిన వాళ్లే భక్షకులుగా మారితే జనం ఏం చేయాలి ? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది.

జగన్ సీఎం అయ్యాక కట్టిన కొత్త ప్రాజెక్టులు ఏవి ? సాగు, తాగునీటిపై ప్రజలకు​ చేసిందేంటి?

భూకబ్జాలు, ఆస్తుల ఆక్రమణ, బలవంతంగా రాయించుకోవడం ఇలాంటి వార్తలు రోజూ చూస్తూనే ఉన్నాం. వివిధ దళిత సంఘాల సమన్వయకర్త బూసి వెంకట్రావు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా ఉన్నప్పటి అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ ఆక్రమణలు, కబ్జాలు, భూముల భద్రతపై ప్రజలు ఆందోళన చెందుతున్న సంఘటనలు చూస్తున్నాం. క్షేత్రస్థాయిలో మీ దృష్టికి వచ్చిన అంశాలేంటి. అధికారపార్టీ నేతలు, వారి అనుచరులు కబ్జాలతో రెచ్చిపోతున్నారు. వారి దెబ్బతో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. జిల్లా ఏదైనా సరే అధికార పార్టీ నేతలకు పట్టపగ్గాలు ఉండటం లేదు. నేతల కన్నుపడిన స్థలాలు తక్షణమే వారి ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ పెట్టిన బోర్డులను సైతం పెకలించి మరీ ఆక్రమణలకు పాల్పడుతున్నారు.

బట్టబయలైన వైసీపీ, వాలంటీర్ల బంధం - రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం ప్రజలు ఏం చేయాలి?

అధికార పార్టీ భూకబ్జాలపై రాష్ట్ర వ్యాప్తంగా మీరు పోరాటాలు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నేతగా ఎప్పటికప్పుడు క్షేత్ర సమాచారం తెలుస్తుంటుంది. వెంకట్రావు గమనించిన ఘటనలు గురించి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొండలు, గుట్టలు, చెరువులు, కాలువలను మింగేశారని ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఎలుగెత్తున్నాయి. విశాఖ నగరం కూడా దీనికి మినహాయింపు కాదు. మీ పరిశీలన ఏంటి? వైసీపీ భూబకాసురుల దురాగతానికి బలైన ఒంటిమిట్ట చేనేత కుటుంబం ఎంతో ఆవేదనకు గురైయ్యారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాధితురాలి కన్నీటిపర్యంతమైన దృశ్యాలు మనం చూశాం. ఈ ఉదంతంపై గతంలో మీరు కూడా పోరాడారు. దీని నేపథ్యం ఏంటి. ఒంటిమిట్టలో అసలు ఏం జరిగింది.

తిరుపతి కైకాలచెరువు పక్కన అధికార పార్టీ నాయకుల భూకబ్జాలపై బాధిత ఎన్నారై ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇలాగైతే ప్రజల ఆస్తులకు భరోసా ఇచ్చేదెవరు. ఎవరికైనా సమస్య వస్తే ప్రభుత్వానికి చెప్పుకొంటారు. కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి రావడంతో సమస్యలు తీరే మార్గం ఏది. ఈసారి ఓటు వేసే ముందు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో ఛాన్స్ ఇవ్వమని వైసీపీ కోరుతోంది. పొరపాటున వాళ్లకు మరో అవకాశం ఇస్తే రాష్ట్రంలో జరగబోయేది ఏంటో ఈ ఐదు సంవత్సరాల చూశాం.

సీఎం జగన్​ రాయలసీమకు ఏం చేశారు? 2024లో ఎందుకు గెలిపించాలి?

ABOUT THE AUTHOR

...view details