Pratidwani: రాష్ట్ర జనాభాలో సగభాగం మహిళలే ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారిది కీలక పాత్ర. సీఎం జగన్ వారికి ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చారు? ఏం నెరవేర్చారు? ఐదేళ్లుగా పన్నులు, ఛార్జీల మోత ప్రభావం వారి ఇంటి బడ్జెట్‌పై ఎలా పడింది? అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హెల్త్ సెంటర్లలో పనిచేసేవారు, మధ్యాహ్న భోజన కార్మికులు, డ్వాక్రాలు, కల్యాణమిత్ర, బీమామిత్ర, యానిమేటర్లకు ఒరిగిందేంటి? బటన్ నొక్కి వారికి ఇచ్చిందెంత, వారి నుంచి లాక్కునది ఎంత? జగన్ పాలనపై వాళ్లు సంతోషంగా ఉన్నారా? మరోసారి వైసీపీ పాలన రావాలని కోరుకుంటున్నారా? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు మహిళలకు ఏవేం హామీలు ఇచ్చారు? వాటిలో ఎన్ని నెరవేర్చారు? జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పారు. కేవలం ఈ హామీ చూసే చాలామంది మహిళలు ఓట్లు వేశారు. మరి సీఎం చేశారు కదా ఆయన్ని. మీకేం చేశారు? రాష్ట్రంలో ఎంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు? వారు ఎలాంటి సేవలు చేస్తున్నారు. వారికి జగన్ ప్రభుత్వం ఏం మేలు చేసింది? దశలవారీగా మద్య నిషేధం చేస్తామన్న సీఎం జగన్ ఇప్పుడు మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మహిళలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యంపై ఏడాదికి రూ.16 వేల కోట్ల ఆదాయం వస్తే జగన్ అధికారం చేపట్టాక అది రూ.36 వేల కోట్లకు చేరింది. బెల్టుషాపులు 70వేలకు పైగా ఉండటంతో కల్తీ మద్యం పెరిగిపోయింది.