Fire Accident in Plastics Industry at Hyderabad: హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎస్వీ పాలిథిన్ సంచుల తయారు చేసే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మధ్యాహ్నం సమయంలో తొలుత చెలరేగిన మంటలు భవనం మూడో అంతస్తు వరకు వ్యాపించాయి. భవనంలో పెద్ద ఎత్తున పాలిథిన్ కవర్లు, వాటి తయారీకి వాడే ముడిసరుకు నిల్వ ఉండడంతో మంటలు భారీగా వ్యాపించాయి.
ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 7 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 40 నీళ్ల ట్యాంకర్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఫైర్ సిబ్బందికి స్వల్పంగా విద్యుత్ షాక్: ఒక దశలో మంటలు ఆర్పుతున్న తరుణంలో భవనం పక్కనే ఉన్న విద్యుత్ హైటెన్షన్ తీగలకు నీరు తగలడంతో ఫైర్ సిబ్బందికి స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి నుంచి బయటకు వచ్చేశారు. విద్యుత్ అధికారులను పిలిపించి హైటెన్షన్ తీగలకు ఉన్న విద్యుత్ సరఫరా ఆపేసి తిరిగి మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంటల ధాటికి భవనం బీటలు వారింది. 8 గంటలుగా మంటలు ఎగిసిపడుతుండటంతో భవనం కొద్ది కొద్దిగా కూలుతోంది.
అదుపులోకి రాని మంటలు: ఓ వైపు భవనం కూలే స్థితిలో ఉండటంతో స్థానికులు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం వల్ల చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇది ఇలా ఉండగా మంటలను అదుపు చేసేందుకు గంటలుగా శ్రమిస్తున్నా అవి విఫలం కావడంతో అగ్నిమాపక దళం సందిగ్ధంలో పడ్డారు. అంతే కాకుండా ఈ ఫ్యాక్టరీలో వ్యర్థం చాలా ఉందని అందువల్లనే మంటలు అదుపులోకి రావడం లేదని వారు ఉంటున్నారు. అయితే జీహెచ్‌ఎంసీ, డీఆర్ఎఫ్, స్థానికులు సహాయంతో ఫైర్ సిబ్బంది మరికొంత సమయంలో మంటలు అదుపులోకి తీసుకు వచ్చే అవకాశముందని తెలుస్తుంది.
పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి - నా పని నేను చేస్తా : దిల్లీలో పవన్ కల్యాణ్
గిరిజనుల్లా ఒక్కరోజైనా గడపాలనుకుంటున్నారా? - పెళ్లి కూడా చేసుకోవచ్చు!