ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలేనా!- ఐదేళ్లుగా వైసీపీ చేసిందేంటి? - Andhra Pradesh Special Status - ANDHRA PRADESH SPECIAL STATUS

Pratidwani Debate on Andhra pradesh Special Status: వైసీపీ ప్రభుత్వ ఎంపీలు ఆంధ్రప్రదేశ్​కు ఎందుకు ఇంకా ప్రత్యేక హోదా తీసుకురాలేదు. అసలు ఏపీ ఎంపీలు ఈ ఐదు సంవత్సరాలలో ఏం సాధించారు. దేశంలోనే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీల్లో ముందు వరుసలో ఉండి సీఎం జగన్ రాష్ట్రానికి​ ఏం సాధించారు. ప్రత్యేక హోదాను తీసుకురాని నేతలు ఓట్లు కోసం వస్తే ప్రజలు ఏం అడగాలో నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

Pratidwani Debate on Special Status in AP
Pratidwani Debate on Special Status in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 1:05 PM IST

Pratidwani:ఇనుపనరాలు, ఉక్కు కండరాలున్న వంద మంది యువకులను నాకు ఇస్తే దేశాన్నే మార్చి చూపిస్తానని స్వామి వివేకానంద చెప్పిన కొటేషన్ గుర్తుందిగా. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా అదే రేంజిలో 25 మంది ఎంపీలను నాకు ఇస్తే రాష్ట్రాన్నే మార్చేస్తానని శపథాలు చేశారు. ఆయన మాటలు నమ్మిన జనం ఓట్లేసి 22 మంది లోక్‌సభ సభ్యులును గెలిపించారు. 9మంది రాజ్యసభ సభ్యులు గెలిచేంతగా ఎమ్మెల్యే, ఎంపీలను ఇచ్చారు. 31మంది ఎంపీలను పెట్టుకుని, దేశంలోనే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీల్లో ముందు వరుసలో ఉండి మరి రాష్ట్రానికి సీఎం జగన్​ ఏం సాధించారు? రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మార్చారా? లేకపోతే ప్రజలను ఏమార్చారా? అసలు ఏపీ ఎంపీలు ఈ ఐదు సంవత్సరాలలో ఏం సాధించారు? మరోసారి ఓటు అడగటానికి వస్తున్న ఫ్యాన్ పార్టీ నాయకులను ప్రజలు ఏమని ప్రశ్నించాలి? ఈ అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం?

రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో లోక్‌సభకు పంపిన మన ఎంపీల పనితీరు ఎలా ఉంది, తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? 2019 – 24 మధ్య కాలంలో మన ఎంపీల పనితీరుపై ఏడీఆర్‌ నివేదికను మీరెలా విశ్లేషిస్తారు? ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర నిధులు తీసుకురావడంలో, సాయాన్ని పొందడంలో మన ఎంపీల కృషి ఎలా ఉంది? ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, రైల్వే జోన్ సహా విభజన హామీల సాధనలో మన ఎంపీలు కనీస పోరాటమైనా చేశారా? ఎంపీలంతా రాజీనామా చేస్తే కేంద్రం దిగొచ్చి హామీలు నెరవేరుస్తుందని ప్రతిపక్షంలో ఉండగా గట్టిగా చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని ఎందుకు చేయలేకపోయారు.

నవరత్నాల పేరుతో జగన్ నయవంచన - అసలు విషయం ఏంటంటే?

వైసీపీ తరఫున 22మంది లోక్‌సభ ఎంపీలు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా కేంద్రానికి వీళ్ల మద్దతు కచ్చితంగా అవసరం ఉంటుంది. బలమైన స్థితిలో ఉంటూ హామీల సాధనకు గట్టిగా పోరాటం చేయగలిగారా? ఎందుకని జగన్ 15మంది ఎంపీ అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పించారు? ఎంపీలుగా వారు ప్రజల్లోకి ఏం మొహం పెట్టుకుని వెళతారు అనే భయం ఉందంటారా? వైసీపీ ఎంపీల పనితీరు ఈ ఐదు సంవత్సరాలలో చూశాకా మళ్లీ ఆ పార్టీకి జనం ఓటేస్తారో లేదో భవిష్యత్తులో తెలుస్తుంది.

2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానంలోనూ గెలవలేదు. కచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేంద్రంలో ఉన్నది బీజేపీ అయినప్పటికీ వైసీపీ ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అటువంటి అంశంపై వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయట్లేదు.

విచ్చలవిడిగా వైసీపీ నేతల భూఆక్రమణలు - కన్ను పడితే చాలు స్థలం కబ్జానే ?

ABOUT THE AUTHOR

...view details