ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

సైబర్ నేరగాళ్లున్నారు బీ కేర్​ ఫుల్​ - Cyber Crimes Persisting - CYBER CRIMES PERSISTING

Pratidhwani :సైబర్‌ నేరాల్లో మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన మోసాలు తీవ్రంగా కలవర పెడుతున్నాయి? వాటి బారిన పడి ప్రజలు ఎన్నిరకాలుగా నష్టపోతున్నారు? తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రతిగంటకు 3 లక్షలు, రోజుకు 67 లక్షల చొప్పు సైబర్ నేరస్థులు దోచుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణమేంటి? వంటి మరిన్ని అంశాలను గురించి నేటి ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 12:57 PM IST

Pratidhwani :కష్టపడి సంపాదించడమే కాదు ఆ కష్టార్జితాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కానీ ఆ మాటే మిథ్య అవుతోంది సైబర్ నేరాల ఉద్ధృతిలో. వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాల్లో ప్రజల జేబులు గుల్లగుల్ల అవుతున్నాయి. కేవైసీ పేరిట మోసాలు మొదలు డిజిటల్ అరెస్టులతో దడ పుట్టించడం వరకు చెలరేగిపోతున్నారు సైబర్ నేరస్థులు. గంటల వ్యవధిలో జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల్ని సైతం ఆశ్చర్యపరిచేలా ఉంటున్నాయి ఈ నేరాలు. సామాన్యులే కాదు ఉన్నత చదువులు చదువుకున్న వారు ఐటీ ఉద్యోగులూ వీరిలో బాధితుల్లో ఉండడమే విస్తుపోయేలా చేస్తోంది. మరి ఈ మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూర్య కొత్త మరొకరు ఇండియన్ సర్వర్స్ సీఈవో సాయిసతీష్.

వైద్యుడిని భయపెట్టి రూ.33 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు - Cyber Crime in Satya Sai District
ఫోన్‌ చేసి పోలీస్‌ మాట్లాడుతున్నామంటూ బెదిరించి లక్షలు దోచేస్తున్న కేసులూ ఈ మధ్య భారీగా పెరుగుతున్నాయి. అసలు వాళ్లెవరు? నేషనల్ డాటాబేస్ ప్రకారం భారతీయులు ఏటా సైబర్‌ నేరాలతో కోల్పోతున్న మొత్తం రూ. 70వేల కోట్లు. రోజుకు నమోదుతున్న కేసులు రూ. 6వేలు. ఇదే కొనసాగితే భవిష్యత్ ఊహించుకోగలమా? ఉద్యోగాల పేరిట వలవేసి ఆర్థికంగా దోచుకోవడమే కాదు విదేశాల్లో బానిసలుగా మార్చుతున్న దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి.

వీటి విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? సైబర్ నేరాల్లో నష్టపోయిన కారణంగా కాపురాలే కూలిపోతున్న సంఘటనలు కూడా ఇటీవల పెరుగుతున్నాయి. వ్యాపారాలు మునిగిపోతున్నాయి. వీటి నుంచి రక్షణ ఎలా? సైబర్‌నేరాల కట్టడికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ సాయం కూడా తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. ఈ విషయంలో AI మనకు ఎలా సహాయపడగలదు? సామాన్యుల కంటే బాగా చదువుకున్నవాళ్లు, ఐటీ ఉద్యోగులే ఎక్కువమంది ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దీనికి సంబంధించిన మరిన్ని అంశాల గురించి పూర్తి విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

సైబర్ నేరాల ఉచ్చులో యువత, మహిళలే ఎక్కువ - అత్యధికంగా విశాఖలో నమోదు - CYBER CRIMES IN AP

ABOUT THE AUTHOR

...view details