Pratidhwani : సాధారణంగా ఇటువంటి ఘటనలు తెలుగు సినిమాల్లో చూసే వాళ్లం. అవేటంటే విలన్ చేసే అక్రమాలపై ఆధారాలను పోలీసులకు ఇవ్వాలి అనుకుంటారొకరు. అంతలో ఫోన్ వస్తుంది. నీ కుటుంబ సభ్యులు నా దగ్గర బందీలుగా ఉన్నారు. నువ్వు ఆధారాలు తీసుకు వచ్చి మాకు అప్పగిస్తే మీ వాళ్లని విడిపిస్తాం అంటారు. అచ్చం సినిమాలో జరిగినట్టే ముంబయిలో ఒక సినీ నటి విషయంలో జరిగింది. ఆ హీరోయిన్‌ను ఓ పారిశ్రామికవేత్త లైంగికంగా వేధించారు. ఆమె అతడిపై కేసు పెట్టింది. ఆ పారిశ్రామికవేత్త మామూలు వ్యక్తి కాదు. నాటి వైఎస్సార్సీపీ పెద్దలకు స్నేహితుడు. ఇంకేముంది ఆ హీరోయిన్‌పై అక్రమ కేసులు పెట్టి జైలులోకి నెట్టారు. పారిశ్రామికవేత్తపై ఆమె పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటేనే నిన్ను విడిచిపెడతామని సినీ ఫక్కీలో బెదిరించారు. ఆమె కుటుంబానికి అక్షరాల నరకం చూపించారు. ఓ మహిళను ప్రభుత్వమే ఇలా చేయటం, దానికి ఐఏఎస్‌లు (IAS), ఐపీఎస్ (IPS) లు సహకరించటాన్ని ఏమనాలి? ఆటవిక రాజ్యం అందామా? ప్రజాస్వామ్యం అందామా? ఇదీ నేటి ప్రతిధ్వని అంశం. చర్చలో పాల్గొంటున్న వారు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, రాజకీయ విశ్లేషకులు పోతుల బాలకోటయ్య.
ఆ ముగ్గురూ కీలకంగా వ్యవహరించారు - ఇంటివద్ద రెక్కీ చేశారు: ముంబయి నటి - MUMBAI ACTRESS CASE