Union Budget 2025-26 Expectations : మరికొన్ని రోజుల్లోనే దేశానికి కొత్త బడ్జెట్ రాబోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్తపద్దు ప్రవేశ పెట్టేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. పరిశ్రమలు, వర్తక, వాణిజ్యాల ప్రతినిధులు ఆయా సంఘాలు, మండళ్లతో సంప్రదింపులు కూడా గట్టిగానే చేశారు. ఐతే ఆ ప్రక్రియలో ఎక్కడా చోటు దక్కని రానున్న బడ్జెట్‌తో అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే వ్యక్తి మరొకరు ఉన్నారు. ఊపిరి బిగబట్టి ఈసారైనా తనకు ఊరట కల్పించమని వేడుకుంటున్నాడు. మరి దేశంలో కోట్లాదిమంది బడ్జెట్ పద్మనాభాల ప్రతినిధి సగటు వేతనజీవుడి బడ్జెట్ అశలు అంచనాలు ఎలా ఉన్నాయి? ఈసారైనా తను కోరుకునే ఊరట, మినహాయింపుల్లో ఉపశమనం లభిస్తుందా? కేంద్రం ఆలోచనలు ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు 1. డా. ఎస్.అనంత్ (ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు, విజయవాడ) 2. చలమల రేవంత్ (సర్టిఫైడ్ వెల్త్‌మేనేజర్, హైదరాబాద్)
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మరికొన్ని రోజుల్లో రానున్న కేంద్రబడ్జెట్ 2025-26పై వేతనజీవులు, మధ్యతరగతి వారు భారీగా అంచనాలు పెట్టుకున్నారని తెలిపారు. నేరుగా ఆదాయపన్ను కాకుండా పరోక్షంగా వేతనజీవులకు 80సీ, 80డీ వంటివాటి కింద ఉన్న మినహాయింపులపై ఆశలు ఉన్నాయన్నారు. నిజానికి నూతన ఆదాయపన్ను చట్టం ప్రవేశ పెడతామన్న మాట చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఈసారైనా అది వస్తుందా? అనేది వేచి చూడాలన్నారు.