Pratidhwani On New ROR Act :కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం భూమి చుట్టే పరిభ్రమిస్తోంది. ధరణి నుంచి హైడ్రా వరకు చెరువుల నుంచి మూసీ వరకు ఎవర్ని కదిపినా ఇదే ప్రస్తావన. ఈ నేపథ్యంలోనే అందర్నుంచీ ప్రధానంగా మరొక డిమాండ్ వినిపిస్తోంది. కబ్జాల కథను కంచికి చేర్చేలా కొత్తచట్టం రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు.
నూతన ఆర్వోఆర్ చట్టం రూపురేఖలు ఎలా ఉండనున్నాయి? - Pratidhwani On New ROR Act
Pratidhwani On New ROR Act : గత కొంతకాలంగా ధరణి నుంచి హైడ్రా వరకు చెరువుల నుంచి మూసీ ప్రక్షాళన వరకు ఎవర్ని కదిపినా భూమి గురించే చర్చంతా. త్వరలో రానున్న కొత్త ఆర్ఓఆర్ చట్టంతో బాటే ఈ దిశగాను చర్యలు తీసుకోవాలంటున్నారు. రాష్ట్రంలో భూ ఆక్రమణల నిరోధానికి ప్రత్యేక చట్టం తీసుకుని రావాలన్న డిమాండ్ బలంగా మళ్లీ తెరపైకి రావడానికి కారణాలు ఏమిటి?
Pratidhwani On New ROR Act (ETV Bharat)
Published : Oct 2, 2024, 12:28 PM IST
భూ ఆక్రమణల నిరోధక చట్టం అమలుతో పాటు, ప్రత్యేక కోర్టులు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. త్వరలో రానున్న కొత్త ఆర్ఓఆర్ చట్టంతో బాటే ఈ దిశగాను చర్యలు తీసుకోవాలంటున్నారు. అసలు ఈ విషయంలో గతంలో ఉన్న చట్టం ఎందుకు రద్దయింది? కొత్త ప్రతిపాదనలు చట్టం రూపం దాల్చితే ప్రభుత్వభూములతో పాటు ప్రైవేటు భూముల యాజమాన్యహక్కులకు ఎలాంటి భరోసా లభిస్తుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.