Pratidhwani : జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అని రామాయణంలో శ్రీరాముల వారు అంటారు. జన్మనిచ్చిన తల్లి, మనం జన్మించిన జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని రామాయణం చెబుతోంది. ఆ స్ఫూర్తితోనే 90వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు జన్మభూమి పథకానికి ప్రాణం పోశారు. దేశవిదేశాల్లో స్థిరపడిన ఆంధ్రులు తాము పుట్టిన గడ్డ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి కాలం వృథా చేయకుండా అందరమూ తలోచేయి వేసి రాష్ట్ర ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేయాలని చంద్రబాబు తపన. ఆ స్ఫూర్తితోనే జన్మభూమి-2 పథకాన్ని మరోసారి ప్రారంభించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి దశలో జన్మభూమి అనుభవాలు ఏమిటి? నాడు ఎలాంటి ఫలితాలు సాధించారు? జన్మభూమి-2 ఎలా ఉండవచ్చు? ఇదే అంశాలపై నేటి ప్రతిధ్వని. చర్చలోసీనియర్ పాత్రికేయులు డీవీ శ్రీనివాస్, రాజకీయ విశ్లేషకులు గురజాల మాల్యాద్రి పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు.
తొలి దశలో జన్మభూమి అనుభవాలు ఏంటి? జన్మభూమి-2 ఎలా ఉండొచ్చు? - Janmabhoomi 2 to be Launched - JANMABHOOMI 2 TO BE LAUNCHED
Pratidhwani : "తరలుదాం రండి జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి" అంటూ జన్మభూమి-2కి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఈ నిర్ణయం నేపథ్యం ఏమిటి? నేటితరంలో చాలామంది, యంత్రాంగంలో కొందరికి ఈ పేరు, ఆ కార్యక్రమ స్ఫూర్తినీ కొత్తగా పరిచయం చేయాలి. అసలు జన్మభూమి ఎలా ప్రారంభమైంది? ఎలాంటి ఫలితాలు సాధించారు? గడిచిన అయిదు సంవత్సరాల్లో ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య ఎలాంటి అంతరం ఏర్పడింది. జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా దానిని ఎలా తగ్గిచుకోవచ్చు?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 11:56 AM IST
Janmabhoomi-2 to be Launched : గడిచిన అయిదు సంవత్సరాల్లో ప్రభుత్వానికి - ప్రజలకు మధ్య ఎలాంటి అంతరం ఏర్పడింది. జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా దానిని ఎలా తగ్గిచుకోవచ్చు? కనీస అభివృద్ధి కార్యక్రమాలకూ నిధులు లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం కూడా కలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? జన్మభూమి మన ఊరు వంటి కార్యక్రమాల ద్వారా ఏ ఏ అంశాల్లో మార్పులు సాధించేందుకు అవకాశం ఉంటుంది? ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం పాత్ర ఏమిటి? రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా, రాష్ట్రంలో ఎంతో మంది స్థితిమంతులు, బయటప్రాంతా ల్లో స్థిరపడిన శ్రీమంతులూ ఉన్నారు. వారు తమ జన్మభూమికి ఎలా ఉపయోగపడవచ్చు? మరీ ముఖ్యంగా స్థానిక అభివృద్ది కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐ ల భాగస్వామ్యాన్నిపెంచేలా, మన ఊరికి మేలు చేయాలన్న స్ఫూర్తి రగిలించేలా ఏం చేస్తే మేలు? దీనిలో ప్రభుత్వ పాత్ర ఎలా ఉండాలి? మీరు జన్మభూమి కార్యక్రమం మొదట్నుంచీ మొత్తం పరిణామాలు ఏలా ఉండనున్నాయన్న విషయాలు తెలుసుకుందాం.