Pratidhwani :యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూసిన అగ్రరాజ్యం ఎన్నికల్లో అన్ని అంచనాలను దాటి మరీ డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం అందుకున్నారు. త్వరలోనే ఆయన నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం ఖాయమైన వేళ ఇకపై భారత్ అమెరికా - సంబంధాలెలా ఉండబోతున్నాయి? ట్రంప్ గెలిచిన వెంటనే కంగ్రాట్స్ మై ఫ్రెండ్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో శుభాకాంక్షల పోస్ట్, అంతకు ముందు ట్రంప్ మోదీపై, ఇండియాపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏం చెబుతున్నాయి?
ఇకపై ద్వైపాక్షికంగా, వ్యూహాత్మకంగా, వర్తక వాణిజ్యాలు, విద్య, ఉద్యోగ అవకాశాల పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోవచ్చు? ట్రంప్ - మోదీ మైత్రీ అధ్యక్ష స్థానంలో ఆయన తీసుకునే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అనుకోవచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సెంటర్‌ఫర్ సౌత్ఈస్ట్ ఏసియా&పసిఫిక్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొ. జయచంద్రారెడ్డి, తిరుపతి ఎస్వీయూ మరొకరు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పి. కృష్ణప్రదీప్.
ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ- ఫైనల్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే!
ఏటా అమెరికా అధ్యక్షుడిచ్చే ఈ విందుకు దేశంలోని ప్రముఖులను కూడా ఆహ్వానిస్తారు. అలా అమెరికాలో అప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త, టీవీ షోలతో సెలబ్రిటీగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ కూడా 2011 ఏప్రిల్‌లో జరిగిన విందుకు హాజరయ్యారు. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా విందుకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగం మొదలెట్టారు. మధ్యలో ఉన్నట్టుండి ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బికినీలు వేసుకున్న అమ్మాయిలతో ఆయన టీవీ షోల గురించి ప్రస్తావిస్తూ, ఎకసెక్కాలాడారు.
అందుకు కారణం లేకపోలేదు. అంతకుముందు అధ్యక్ష ఎన్నికల వేళ ఒబామా కెన్యాలో పుట్టాడని, అమెరికాలో జన్మించలేదని, అందుకే అధ్యక్షపదవికి అనర్హుడని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు మీడియాలో వచ్చింది. ఆ వివాదం సద్దుమణిగి అధ్యక్షుడిగా ఎన్నికైనా ఒబామా దాన్ని మనసులో పెట్టుకున్నారు. ఈ విందులో ప్రతీకారం తీర్చుకున్నారు. విందుకు వచ్చినవారంతా ఒబామా వెటకారాన్ని విని పడీపడీ నవ్వుతుంటే, ట్రంప్ తలవంచుకొని ఉండిపోయారు. ఫలితం 2016లో బలమైన హిల్లరీ క్లింటన్‌ను ఓడించి మరీ శ్వేతసౌధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ రెండోసారి కూడా మహిళా అభ్యర్థి కమలా హారిస్‌పై నెగ్గి అరుదైన ఘనత సాధించారు.
'కొంపముంచిన యుద్ధాలు - కాపాడని హామీలు' కమలా హారిస్ ఓటమికి కారణాలివే!