Pratidhwani : ఏటా మార్చి-ఏప్రిల్‌లో మంట పుట్టించే ఎండలు ఈసారి ముందే చుక్కలు చూపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే, శివరాత్రికి శివ శివ అంటూ చలి సెలవు తీసుకోక ముందే సూర్యుడు చెలరేగి పోతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అసాధారణ వేడి ఉక్కపోతే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భూతాపం కారణంగా ఇప్పటికే గడిచిన 2024 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. మరి 2025 ఏం చేయబోతోందీ అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఈ భగభగల వెనక అసలు కారణాలేంటి? ముందస్తు సెగలపై వాతారణ విభాగం, పర్యావరణ నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు, ప్రముఖ పర్యావరణవేత్త డా. కె. బాబురావు
ఎప్పుడూ లేని రీతిలో ఈసారి ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ విషయంలో వాతావరణ విభాగం పరిశీలన ఏమిటి ? అసలు గతంలో ఎప్పుడైనా ఇలా ఉందా? సాధారణంగా వాతావరణంలో మార్పులు కారణాలు ఏమిటి? కొంతకాలంగా అధికఉష్ణోగ్రతల నమోదు ఎందుకు పెరిగింది? 2018 మొదలు వేడి సంవత్సరాల్లో ఏటికేడు రికార్డులు నమోదవుతున్నాయి. అత్యంత వేడి సంవత్సరాల జాబితాలో 1 నుంచి 4 వరకు ఈ సమయంలోనే ఉన్నాయి. ఎందుకు?
పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో ప్రత్యేకించి ఉద్గారాల పాత్ర ఏమిటి? ఆ విషయంలో ఒక పర్యావర ణ వేత్తగా తెలుగుపరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా ఉండాలంటారు? ఫిబ్రవరి నాటికే ఉన్న ఈ వేడి సంకేతాలు ఏం చెబుతున్నాయి? ఈ వేసవి ఇలానే భగభగ మండుతుందా? రానున్న రోజుల్లో పరిస్థితుల్లో ఏమైనా మార్పులు రావొచ్చా? ప్రపంచ వాతవరణ సంస్థ సమాచారం ప్రకారం 2024 చరిత్రలోనే అత్యంత వేడి ఏడాదిగా ఉంది. ఇప్పుడు సెగలు బట్టి 2025 ఆ రికార్డును కూడా తిరగరాయనుందా?
మొదలైన భానుడి భగభగలు - ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
వాతావరణ విభాగం తీసుకునే ఉష్ణోగ్రతల లెక్కల బట్టి ఫలానా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతు ఉండడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉంటాయా? హైదరాబాద్ వంటి మహానగరాలు మరింతగా వేడెక్కుతున్నాయన్నది స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. కారణాలేంటి ఈ విషయంలో అందరి ముందున్న మార్గాలేంటి? వీటన్నింటికీ సమాధానాలు ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.