Pratidhwani on How Should Centre Help Flood Affected Areas :తెలుగు రాష్ట్రాలకు తీరని గుండెకోత మిగిల్చాయి ఇటీవలి వాయుగుండంతో ముంచెత్తిన వరదలు. ఎటు చూసినా వరద ప్రవాహాలు మిగిల్చిన కష్టం ఆ కారణంగా కలిగిన అపార నష్టమే కనిపిస్తోంది. ఉభయ రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో రైతుల కష్టం నీటి పాలయ్యింది. కొన్ని చోట్ల పంట పొలాలు నామరూపాల్లేకుండా విధ్వంసానికి గురయ్యాయి. చెరువులు తెగి పోయాయి. వాగులు గండ్లు పడ్డాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పంటలు సర్వనాశనమయ్యాయి.
ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేదెలా అన్నదే రెండు రాష్ట్ర ప్రభుత్వాల ముందు సవాల్‌గా మారింది. ఇదే సమయంలో నష్టం అంచనాలకు కేంద్రబృందం తరలిరావడం చిమ్మ చీకట్లలో చిరు దీపంలా ఆశలు కలిగిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం నుంచి ఎలాంటి ఆపన్నహస్తం అందిస్తే రైతులు కాస్తయినా కోలుకునే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి, భారతీయ కిసాన్ సంఘ్ జే కుమారస్వామి.
పొలాలను వీడని వరద- రైతన్నలకు తీరని వ్యథ - Crops Loss Due to Floods in Guntur
పంట నష్టం ఒక్కటే కాదు, పొలాలు కోతకు గురికావడం, ఇసుక, రాళ్లు వంటివి కప్పేయడం రూపంలో పొలాలకు ఎంతో నష్టం జరిగింది. దానిపై క్షేత్రస్థాయిలో పరసిస్థితులు ఎలా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి వరదలు, విపత్తుల సమయంలో కేంద్ర, రాష్ట్రాల నుంచి రైతులకు ఎలాంటి సాయం అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సరిపోతుందా? ఇలాంటి విపత్తుల సమయంలో రైతులకు పరిహారం, ఆదుకోవడం విషయం లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి విధానాలు అవలంబిస్తారు? వాటి నుంచి ఏం నేర్చుకోవాలి?
నేరుగా నగదు సాయంతో పాటు ఇప్పటికే ఉన్న పథకాల్లో ఉదారంగా వ్యవరహించడం ద్వారా కేంద్రం తలుచుకుంటే వరదబాధిత రైతులకు ఎలాంటి మేలు చేకూర్చవచ్చు? కొంతకాలంగా కారణాలు ఏవైనా వరదలు, విపత్తులు తరచు వేధిస్తున్నాయి. వీటి నేపథ్యం లో కేంద్ర సాయం విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? రైతులకు నష్టం జరిగిన ప్రతిసారి దేహీ అని చూడకుండా బీమా భరోసా ఎందుకు కల్పించలేక పోతుంది ప్రభుత్వం? ఈ విషయంలో ఇకనైనా ఏం జరగాలి? వీటిని గురించిన సమగ్ర సమాచారం ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.
వరద తాకిడికి అన్నదాత విలవిల- నీటిపారుదల శాఖకు సవాల్‌గా గండ్ల పూడ్చివేత - CANALS DAMAGE IN GUNTUR