Pratidhwani on Plastic Pollution :భూతంలా భయపెడుతోంది ప్లాస్టిక్ కాలుష్యం. ఇల్లు, వాకిలి వీధి, కాల్వలు, చెరువులు, నదుల నుంచి సాగరాల వరకు అదే కమ్మేస్తోంది. కాలువలు, నదుల ద్వారానే ఏటా 1.1 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఏడాదికి 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనుషులు, జంతువుల శరీరాల్లో అణువణువుకి చేరిపోతున్నాయి సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాలు.
ఈ విపత్తును ఎదుర్కోవడానికే 2022 జూలై నుంచి ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించింది కేంద్రం. రాష్ట్రాలు కూడా అదే బాటలో వాటి అంతమే మా పంతం అన్నాయి. కానీ తర్వాత ఏం జరిగింది? సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు ఎలా ఉందనేదానిపై తెలుగురాష్ట్రాలు హైదరాబాద్ వంటి నగరాల్లోనే మీరు గమనిస్తున్న అంశాలేమిటి? కంటికి కనిపించే ప్లాస్టిక్‌నే కాదు దాని సూక్ష్మవ్యర్థాలు మనిషి, జంతుజాలాల అణువుణువులోకి చేరి ఎలాంటి ఉపద్రవాలకు కారణం అవుతున్నాయి. దీనిపై అవగాహన ఉంటోందా?
ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా ఏటా 10 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అది గమనించే వాటిపై యుద్ధం అని ప్రకటించినా అమల్లో ఎందుకీ తడబాటు? ప్లాస్టిక్ నిషేధం ఎందుకు ఇంత సంక్లిష్టంగా మారింది? దీనికి ప్రత్యమ్నాయాలు చూపడం అంత కష్టమా? ఈ విషయంలో అనుకుంటే మార్గాలు లేవా? శాస్త్రవేత్తలు గానీ, పర్యవరణవేత్తలకు గానీ చూపించే ప్రత్యమ్నాయాలు రీజనబుల్‌గా ఉండడం ఎంత ముఖ్యమో లభ్యత, నాణ్యత, హేండీనెస్, ధరలు అంతే ముఖ్యం. ఆ దిశలో ఎక్కడున్నాం?