తెలంగాణ

telangana

ETV Bharat / opinion

హెజ్‌బొల్లా Vs ఇజ్రాయెల్ - ఈ యుద్ధం దారెటు? - ISRAEL AND HEZBOLLAH WAR

Pratidhwani On Israel Hezbollah War : హమాస్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం కాస్త ఇప్పుడు హెజ్‌బొల్లా వర్సెస్‌ ఇజ్రాయెల్‌గా మారింది. కొన్ని రోజులుగా హెజ్‌బొల్లాను లక్ష్యం చేసుకుంటున్న నెతన్యాహు సేనలు క్రమంగా దాడుల తీవ్రతను పెంచుతున్నాయి. ఇటీవల బీరుట్‌ దాడికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడింది.

Prathidwani on Israel and Hezbolla War
Prathidwani on Israel and Hezbolla War (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2024, 2:21 PM IST

Israel and Hezbollah War :దశాబ్దాలుగా ఆరని అరబ్‌- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత నిప్పులు కుంపటిగా మారుతోంది. ఉన్నట్లుండి హెజ్‌బొల్లాపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌పై చేయి సాధించినట్లు కనిపించినా ఆ వెనక పొంచి ఉన్న సవాళ్లు అంతర్జాతీయ సమాజాన్ని కలవర పెడుతున్నాయి. లెబనాన్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్కరోజే ఇజ్రాయేల్ దాడుల్లో అక్కడ 492 మంది ప్రాణాలు కోల్పోయారు.

అసలు ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య మొదలైన ఈ యుద్ధం ఇంతగా ఎందుకు విస్తరిస్తోంది? ఆ నిప్పురవ్వలు ఇరాన్ నుంచి లెబనాన్ వరకు ఎందుకు మంటలు పుట్టిస్తున్నాయి? ఇది ఇప్పట్లో ఆగుతుందా? మరింతగా రాజుకుంటుందా? ఇంటా బయటా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నెతన్యాహు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? దీని ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చల్లో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డా. కన్నెగంటి రమేశ్​, ఐక్యరాజ్య సమితి మాజీ భద్రతా సలహాదారుడు, విశ్రాంత ఐపీఎస్​ కేసీ రెడ్డి పాల్గొన్నారు.

ఇజ్రాయెల్​ దాడులతో దక్షిణ లెబనాన్‌లోని గ్రామాలు వణికిపోయాయి. వేల మంది పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాల్లో బీరుట్‌వైపు పారిపోవడం ప్రారంభించారు. దాంతో రాజధానికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయి, ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. హెజ్‌బొల్లాకు చెందిన దాదాపు 1300 లక్ష్యాలను ఢీకొట్టామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. హెజ్‌బొల్లా క్షిపణుల నిర్వీర్యమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది. 2006లో ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య జరుగుతున్న అతి పెద్ద ఘర్షణ ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఇజ్రాయెల్‌కు చెందిన రెండు సైనిక స్థావరాలపై తాము 125 రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా తెలిపింది.

లెబనాన్‌పై తమ దాడుల పరంపర ఆగదని ఇజ్రాయెల్‌ స్పష్టంచేసింది. హెజ్‌బొల్లా ఆయుధాలను దాచిన బెకా లోయనూ ధ్వంసం చేస్తామని ప్రకటించింది. లోయలోని పౌరులు ఆయుధాలు దాచిన నివాసాలను వదిలి తక్షణం వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డానియెల్‌ హగారీ తెలిపారు. తమ హెచ్చరికను లెబనాన్‌ పౌరులు తీవ్రంగా తీసుకోవాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ సాయంతో ఈ బెకా లోయలోనే హెజ్‌బొల్లా 1982లో ఆవిర్భవించింది.

లెబనాన్​పై ఇజ్రాయెల్ డెడ్లీ అటాక్స్- ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జనం పరుగులు - israel lebanon war

హమాస్​కు చావుదెబ్బ! మిలిటెంట్ గ్రూప్​ అధినేత యాహ్యా సిన్వార్ మృతి! తెరపైకి ఇజ్రాయెల్ డ్రామా! - Is Hamas Chief Yahya Sinwar Dead

ABOUT THE AUTHOR

...view details