ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

భయపెడుతోన్న హెచ్‌ఎంపీవీ - ఎలా వ్యాపిస్తుంది? ఎలా అడ్డుకోవాలి? - PRATIDHWANI ON HMPV VIRUS

చైనా నుంచే మొదలైన అలజడి - భారత్‌లోనూ హెచ్‌ఎంపీవీ కేసుల నమోదు

HMPV Cases in India
HMPV Cases in India (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 11:51 AM IST

Pratidhwani on HMPV Virus :ప్రపంచాన్నిమరో కొత్త వైరస్ భయపెడుతోంది. అసలే కొవిడ్-19 తర్వాత చిన్న హెచ్చరిక విన్నా ఉలిక్కిపడుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ పుట్టిన అదే చైనాలో వెలుగుచూసిన హ్యూమన్‌ మెటాన్యూమో వైరస్ కలకలాన్నే రేపుతోంది. ఇంకో ముసలం పుట్టిందా అనే ఆందోళన మొదలైంది. చైనాలో కేసుల గురించి వింటున్న సమయంలోనే మనదేశంలోనూ ఆ హెచ్ఎంపీవీ బాధితులు నమోదు కావడం ఇదేం కొత్త బాధరా అనే చేస్తోంది.

HMPV Virus Cases in India :అయితే హెచ్‌ఎంపీవీ వైరస్ పాతదేనని ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పలు రాష్ట్రాలు వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించాయి. మరోవైపు కొత్త వైరస్‌- హెచ్ఎంపీవీ ఈరోజున్న పరిస్థితుల ప్రకారం అంత ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని అనుకోవచ్చా? కరోనా విషయంలో ఎందుకు అంచనాలు ఫెయిల్ అయ్యాయి? ఆ తప్పులు మరోసారి జరిగే ప్రమాదం ఉందా?

పాఠశాలలు, విద్యార్థులు కొత్త వైరస్ విషయంలో ఎలా వ్యవహరించాలి? కొవిడ్ నేర్పిన పాఠాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి స్కూల్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?హెచ్ఎంపీవీ - ఇతర శ్వాసకోశ వైరస్‌ల మధ్య తేడా ఏమిటి? ఈ వైరస్‌కు వ్యాక్సిన్ ఉందా? లేదా? హెచ్ఎంపీవీ వైరస్‌ పాతదే అంటున్నందున చికిత్సల సంగతి ఏమిటి? తీవ్రమైన పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి? చిన్నపిల్లలు, వృద్ధులతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకేం చేయాలి?

ఈ వైరస్‌ను నిర్ధరించడానికి ఏ రకమైన పరీక్షలు చేస్తారు? అవి మనవద్ద అందుబాటులో ఉన్నాయా వైద్యారోగ్య వ్యవస్థలు ఎలా సన్నద్ధం కావాలి? ఇదే కాదు ఇలాంటి ఏ వైరస్ కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? వ్యక్తిగత శుభ్రత మొదలు ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.బి.రంగారెడ్డి, కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెచ్‌ఓడీ, పిడియాట్రిక్స్ విభాగం డా. శ్రీనివాస్ కల్యాణి పాల్గొన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం.

హెచ్‌ఎంపీవీపై అప్రమత్తంగా ఉందాం - ప్రజలు శుభ్రత పాటించాలని చంద్రబాబు సూచన

'పిల్లల్లోనే HMPV ప్రభావం ఎక్కువ'- ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని సలహా!

ABOUT THE AUTHOR

...view details