Prathidhwani : కృష్ణం వందే జగద్గురుమ్ శ్రీకృష్ణుడు అంటే దేవుడు మాత్రమే కాదు ఓ మంచి స్నేహితుడు, అంతకు మించిన గురువు కూడా అని చెబుతారు. అనాదిగా మనం వింటోన్న మాట ఇది. అయితే ఆ కృష్ణ పరమాత్ముడిని జగద్గురువు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? మిగిలిన ఏ అవతారాల్లోనూ లేని రీతిలో రాముడు, కృష్ణుడి రూపాలను మాత్రమే పరిపూర్ణ అవతారాలు ఎందుకు చెబుతారు? సింపుల్‌గా కనిపించే కృష్ణతత్వాన్ని తరచిచూస్తే వాళ్లను అనంతం అని ఎందుకు అంటారు? ఒక మనిషిగా మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో అని కృష్ణతత్వం ఏం చెబుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్నవారు ప్రఖ్యాత ఘనాపాఠి, వేదపండితులు శ్రీ ప్రాతూరి వంశీకృష్ణ. మరొకరు ఆర్ష విద్యా తపస్వి, ప్రముఖ ప్రవచనకర్త శ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ.
శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించారు? ఎక్కడ పెరిగారు? ఎక్కడెక్కడ సంచరించారు? ఎక్కడ చివరగా నిర్యాణం చెందారు? ఆ ప్రాంతాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? కృష్ణం వందే జగద్గురుమ్ అని ఎందుకు అంటారు? శ్రీకృష్ణ పరమాత్మను జగద్గురువుగా ఎవరు సంబోధించారు? ఎందుకు అలా పిలుస్తారు? పద్దెనిమిది రోజులు పాటు జరిగిన మహాభారత యుద్ధంలో ఎంతమంది మరణించారు? తద్వారా ఏం సాధించారు? కృష్ణ పరమాత్మ ఎందుకు దానిని ఆపలేకపోయారు? భగవద్గీత అనేది ద్వాపర యుగంలోకురుక్షేత్ర మహా సంగ్రామం ప్రారంభ సమయంలో నిస్పృహకు లోనైన అర్జనుడిని కార్యోన్ముఖుడిని చేయటం కోసం కృష్ణ పరమాత్మ గీతా బోధన చేశారు.