వణికిస్తోన్న విషజ్వరాలు - కట్టడి చర్యలకు మార్గాలేంటి? - Viral fever Increasing In Telangana - VIRAL FEVER INCREASING IN TELANGANA
Viral Fevers In Telangana : తెలంగాణలో విషజ్వరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్స్ భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలపై ప్రతిధ్వని చర్చలో తెలుసుకుందాం.
Published : Aug 22, 2024, 10:53 AM IST
Prathidwani Debate on Viral Fevers in Telangana :రాష్ట్రం విషజ్వరాలతో వణుకుతోంది. మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కలే వైరల్ ఫీవర్స్ భారీ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గన్యా, మలేరియా జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల ఓపీలన్నీ కిటకిటలాడుతున్నాయి. కొంతమందిలో అయితే జ్వరాల తీవ్రత కలవరపెడుతోంది. లక్షణాలూ అంతుబట్టని రీతిలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరి, ఏటా వర్షాకాలం సీజన్ వచ్చేసరికి ఎందుకీ జ్వరాల ముట్టడి? ఈ విషయంలో వైద్య వసతులతో పాటు విధానపరంగా సరిచేసుకోవాల్సిన అంశాలేమిటి? మరీ ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.