Prathidwani :రాష్ట్రానికి నీటి కష్టం పొంచి ఉంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో చివరి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు పెనుప్రమాదం ముంచుకొస్తోంది. కొద్దిరోజులుగా కాగుతున్న కృష్ణా నదీ జలాల వివాదం చివరకు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ఏ తీరాలకు చేర్చనుంది? కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి గత నవంబర్‌లో బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు ఇచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతోంది? కృష్ణాజలాల పంపిణీ పున:పరిశీలనంటూ జరిగితే అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్యే ఉండాలన్న వాదనల్ని జగన్ ప్రభుత్వం కొనసాగించలేక పోయింది? ఈ అయిదేళ్ల తప్పిదాల్ని సరి చేయడంతో పాటు కృష్ణాజలాల విషయంలో కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? కృష్ణాజలాలు - కొత్తప్రభుత్వం ముందున్న సవాళ్లు అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సాగునీటి రంగం నిపుణులు, కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ పుస్తక రచయిత టి. లక్ష్మీనారాయణ, రైతుసేవా సంస్థ అధ్యక్షుడు ఏ భవానీప్రసాద్ పాల్గొంటున్నారు.
కృష్ణా జలాల నీటిహక్కుల విషయంలో కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోన్న సవాళ్లు ఏమిటి? రాష్ట్రం మొత్తం సాగు, తాగునీటి అవసరాల్లో కృష్ణాజలాల వాటాఎంత? ఇవే సవాళ్లు కొనసాగితే రాష్ట్రం నీటివనరుల పరంగా ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది? కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి గతేడాది నవంబర్‌లో బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌కు ఇచ్చిన కొత్తమార్గదర్శకాల ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతోంది? కృష్ణాజలాల పంపిణీ పున:పరిశీలనంటూ జరిగితే భాగస్వామ్యులైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ఉండాలి. రాష్ట్రంలోని గతప్రభుత్వమూ అదే వాదించింది. కానీ తర్వాత ఏం జరిగింది? జగన్ ప్రభుత్వం అదే వాదన కొనసాగించి, హక్కుల్ని ఎందుకు కాపాడలేకపోయింది?