Prathidwani Debate on Unity of Central and State Governments :దేశాభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి టీం భారత్‌లా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు తప్ప, మిగతా సమయంలో కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటామని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సమాఖ్య స్పూర్తిగా తగినట్టుగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలంగాణ పర్యటనలో ప్రధానితో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా సీఎం పాల్గొన్నారు. అదేవిధంగా కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాక్షించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధిలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందన్న ఆయన, మూసీ రివర్ అభివృద్ధికి(Moosy River Development) కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి. అందుకోసం ఏ విధంగా పనిచేయాలనే అంశంపై నేటి ప్రతిధ్వని.
క్యా సీన్ హై! - ఎయిర్‌పోర్ట్‌లో మోదీ, రేవంత్‌ల మధ్య సరదా సంభాషణ
Revanth Govt Focus on State Development :తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, చెప్పిన ప్రకారం సకాలంలో అమలు చేస్తూనే అటు కేంద్రంతోనూ సఖ్యతగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు, ముఖ్యమైన పలు ప్రాజెక్టుల నిర్మాణాల అనుమతుల కోసం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లి ప్రధానిని, ఇతర కేంద్రమంత్రులను కలవటం వంటివి చేశారు.