తెలంగాణ

telangana

ETV Bharat / opinion

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో విలక్షణ తీర్పు - ప్రజలు ఏ ప్రాతిపదికన ఓట్లేశారు? - Prathidhwani on TG Lok Sabha Election Results 2024 - PRATHIDHWANI ON TG LOK SABHA ELECTION RESULTS 2024

Prathidhwani on Telangana Lok Sabha Poll Results 2024 : లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. అధికార, ప్రతిపక్షాల అంచనాలకు భిన్నంగా ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు కట్టబెట్టారు. మరి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తేడా ఏంటి? ప్రజలు ఏయే అంశాల ప్రాతిపదికన పార్టీలకు ఓట్లేశారు? అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని

Prathidhwani on TG Lok Sabha Election Results 2024
Prathidhwani on TG Lok Sabha Election Results 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 10:09 AM IST

Prathidhwani on TG Lok Sabha Election Results 2024 :సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. అధికార, ప్రతిపక్ష పార్టీల అంచనాలకు భిన్నంగా ఓట్లేసి ఆశ్చర్యపర్చారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే స్వల్పంగా ఓటు శాతం పెంచుకుంది. అదే సమయంలో బీజేపీ పందొమ్మిది శాతం ఓట్లు పెంచుకుంటే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇరవై శాతానికి పైగా ఓటు బ్యాంకును కోల్పోయింది. మరోవైపు కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది.

Lok Sabha Election Results 2024 :ఈ నేపథ్యంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల మధ్య ఉన్న తేడా ఏంటి? రాష్ట్రంలో ప్రజలు ఏఏ అంశాల ప్రాతిపదికన ఓట్లేశారు? కమలం పార్టీ బలం అనూహ్యంగా పెరగడానికి, భారత్ రాష్ట్ర సమితి బలం వేగంగా పతనం కావడానికి కారణాలేంటి? ఫలితాల నుంచి కాంగ్రెస్‌ నేర్చుకోవాల్సిన పాఠమేంటి? అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీకి 1 శాతం ఓట్లు తగ్గడంతో పాటు, 63 సీట్లు తగ్గాయి. మరోవైపు హస్తం పార్టీ ఖాతాలోకి అదనంగా 47 సీట్లను గెలుచుకొని 1.7 శాతం ఓటు బ్యాంకును పెంచుకుంది. మారిన ఓట్లు తక్కువే అయినా గెలుపోటముల్లో భారీ తేడాలు ఉన్నాయి. మరి ప్రజలు ఏ ప్రాతిపదికన ఓట్లేశారు? ఇదే నేటి ప్రతిధ్వని.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details