ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

తిరుమల పవిత్రత పునరుద్ధరణకు ప్రభుత్వం ఏం చేయనుంది? - Prathidwani on TTD Irregularities - PRATHIDWANI ON TTD IRREGULARITIES

Prathidwani: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వరుని కొండపై మాజీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి చేసినవన్నీ అధర్మాలే అంటూ అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. తిరుమలకు ఎంత అప్రతిష్ట తేవాలో అంతా తెచ్చారు. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మళ్లీ తిరుమల పవిత్రత పునరుద్దరించాలంటే ఏం చేయాలి?

Prathidwani Debate on TTD Irregularities
Prathidwani Debate on TTD Irregularities (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 10:05 AM IST

Prathidwani :తిరుమల దర్శనం సకల పాప హరణం. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన ఏడుకొండలపై భక్తుల్లో ఆనాదిగా ఉన్న నమ్మకం ఇది. అణువణువునా ఆధ్యాత్మికత తొణికసలాడే ఆ దివ్యక్షేత్రం అడుగడుగునా వివాదాలమయం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్, అతడి అనుచరగణం. కొండపై తిష్టవేసి కొందరు, వారి వెనకుండి మంత్రాంగాలు నడిపి మరికొందరు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత అప్రతిష్ట తేవాలో అంతా తెచ్చారు. ఈ వరసలో ముందుగా వినిపించే, కనిపించే పేరు ఇటీవల వరకు అక్కడ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి. పేరుకే ధర్మారెడ్డి అయినా కొండపై ఆయన చేసినవన్నీ అధర్మాలే అంటూ అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి నూతన ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఈ అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డిలు పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా, విజయ్ కుమార్ రెడ్డి మీద జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదులు ఇచ్చాయి. ఇటీవలే ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేయగా కేంద్రంలో చేరేందుకు దిల్లీకి వెళ్లిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెనక్కు వచ్చారు.

Vigilance Inquiry: ధర్మారెడ్డి, విజయ్​కుమార్​రెడ్డిపై విజిలెన్స్​ విచారణకు ఆదేశం - Inquiry ON TTD EO IPR COMMISSIONER

దర్యాప్తులో భాగంగా వారి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులనూ విచారణ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవాణి టిక్కెట్లలో అక్రమాలకు పాల్పడ్డారని టీటీడీని అడ్డం పెట్టుకుని వైఎస్సార్​సీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్​తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ధర్మారెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. సమాచార శాఖలో ప్రకటనల పేరిట కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. వైఎస్సార్సీపీకి లబ్ది చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని, వారిపై సీబీ సీఐడీ లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని కోరారు.

'టీటీడీ మాజీ ఈవో, ఛైర్మన్ల అవినీతిపై విచారణ జరపాలి' - TDP Leaders Complaint on corruption

తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ విరాళాల సేకరణకు మార్గంగా ధర్మారెడ్డి వ్యవహరించారని తెలిపారు. ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే క్రిమినల్ కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు దిల్లీలో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయని లేఖలో పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొంది.

సోషల్ మీడియాలో ధర్డ్ గ్రేడ్ కంటెంట్ - వాటికి అడ్టుకట్ట వేసేదెలా? - Social Media Offences in ap

ABOUT THE AUTHOR

...view details