Prathidhwani on Road Accidents :దేశంలో ఏటా లక్షన్నర మందికి పైగా కబళిస్తున్నాయి రోడ్డు ప్రమాదాలు. 50 లక్షల మందికి పైగానే వికలాంగులు అవుతున్నారు. వీరి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర కష్టాల పాలవుతున్నాయి. నిత్యం సగటున 462 మంది, ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతూ రహదారులపై రక్తపు చారికలు తడి ఆరడం లేదు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) విషాదాంతం ఈ గణాంకాల్ని మరోసారి చర్చకు పెట్టింది.
తడి ఆరని రక్తపు చారికలు - రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏంటి? - Road Accidents in Telangana
Prathidhwani on Road Accidents : దేశంలో ఏటా లక్షన్నర మందికి పైగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. 50 లక్షలకు పైగా ఈ ప్రమాదాల వల్ల వికలాంగులై అర్థిక స్తోమతకు నోచుకోలేక సతమతమవుతున్నారు. ప్రయాణంలో నిర్లక్ష్యంగా ఉంటే పెనుముప్పు ముంచెత్తే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
Published : Feb 24, 2024, 10:12 AM IST
Road Accidents Tremendously Increased : ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రహదారి మరణాల్లో 11 శాతం భారత దేశం నుంచే ఉండటం గమనార్హం. అతివేగం, సీట్ బెల్ట్, హెల్మెట్ ధారణ వంటి చిన్న చిన్న జాగ్రత్తల్లో అలసత్వంతోనే పెనుముప్పు ముంచెత్తుతుంది. దేశం మొత్తం ఇదే సమస్యతో సతమతమవుతోంది. దేశ జీడీపీలో 3.14 శాతం వరకు నష్టానికి కారణం రహదారుల ప్రమాదాలే. మరి ఇంతటి స్థాయిలో ఆందోళన కలిగిస్తోన్న రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి? ప్రభుత్వం, పౌర సమాజం ముందు ఈ విషయంలో ఉన్న సవాళ్లేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.