Residence on Moon How Far Is It for Human :వెన్నెల పంచే చందమామను అప్పుడప్పుడు పలకరించి రావడం కాదు! సరదాగా అక్కడికో ట్రిప్ వేసొస్తే ఎలా ఉంటుంది?! ఏం పోయి వస్తాలేం అని అక్కడికే మకాం మార్చేస్తే ఇంకెంత బావుంటుందో కదా! ఈ ఊహలకు కొత్తరెక్కలు ఇస్తున్నాయి అంతరిక్ష పరిశోధనలు. నిజానికి ఆ చల్లనిరేడుపై మనిషి అడుగు పెట్టి చాన్నాళ్లే అయింది. కానీ పట్టుమని కాసేపు, కొన్నిరోజులు అక్కడ ఉండలేక పోయారే అన్న నిట్టూర్పు మాత్రం వెంటాడుతునే ఉంది.
ఆ లోటును భర్తీ చేసేందుకు, చందమామను శాశ్వత ఆవాసంగా మార్చుకునేందుకే ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. అమెరికా అంతరిక్ష పరిశో ధనా సంస్థ- నాసా ఆ విషయంలో చాలా విషయాలు చెబుతోంది. ఇప్పుడు ఆ రేసులో మేమూ రెడీ అంటోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. మరి చందమామపై నివాసాలకు మనిషి ఎంతదూరంలో ఉన్నాడు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ఇస్రో విశ్రాంత అసోసియేట్ డైరెక్టర్ డా. వి. శేషగిరిరావు, అంతరిక్ష వ్యవహారాల నిపుణులు బైరిశెట్టి మల్లికార్జునరావు
ఎంతోకాలంగా ఊహలకే పరిమితం అనుకున్న చందమామపై ఆవాసాల ఆలోచనలు వాస్తవ రూపం దాల్చనున్నాయా? చంద్రుడిపై ఆవాసాలకు మనిషి ఎంతదూరంలో ఉన్నాడు? అసలు చందమామపై మనిషి మనగలడా? సాంకేతికాంశాలు కాసేపు అలా ఉంచితే జీవం ఉనికికి కావాల్సిన వాతావరణం, పరిస్థితులు అక్కడ సాధ్యమేనా? చందమామ, అంగారకుడు వంటి గమస్యస్థానాలకు వ్యోమగాములను పంపడానికి లద్దాఖ్‌లో ఇస్రో ఏర్పాటు చేస్తామంటున్న అనలాగ్ స్పేస్ మిషన్ ప్రత్యేకత ఏమిటి?