Prathidhwani Debate On Leaders Migration : లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రాజకీయ నేతలు పార్టీలు మారుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలో అధిక సంఖ్యలో చేరుతున్నారు. అసలు ఇంత భారీస్థాయిలో నాయకులు పార్టీలు మారడానికి కారణమేంటి?ఈ వలసలు ఇంతటితో ఆగుతాయా, మరింత పెరుగుతాయా? ఎన్నికలపై వలసలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి గులాబీ పార్టీలోకి వలసలు. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి నుంచి హస్తం పార్టీ, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.అధికారం లేనిదే రాజకీయాల్లో మనలేని పరిస్థితి ఎందుకు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బలు : పార్లమెంట్ ఎన్నికల వేళ గులాబీ పార్టీకి భారీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు అవకాశం రాదని నిర్ణయించుకున్న సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ నాయకులు పార్టీని వీడుతున్నారు. ఎంపీలు రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. మరో ఎంపీ పోతుగంటి రాములు కమలం పార్టీలో చేరారు. తాజాగా గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కూడా షాక్ ఇచ్చారు. ఆయన తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి హస్తం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.