ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

భూ యాజమాన్య హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి : న్యాయవాదులు

Lawyers Relay Strike Against Land Ownership Right Act : భూ యాజమాన్య హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని బాపట్ల జిల్లాలో న్యాయవాదులు కోర్టు ఎదుట రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుందని వారు వెల్లడించారు.

lawyers_strike
lawyers_strike

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 4:33 PM IST

భూ యాజమాన్య హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి : న్యాయవాదులు

Lawyers Relay Strike Against Land Ownership Right Act :రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కులను కాలరాస్తూ తెచ్చిన చీకటి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ బాపట్ల జిల్లాలో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. చీరాలలో కోర్టు సమీపంలో న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షలకు ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. భూ యాజమాన్య హక్కులను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. భూహక్కు చట్టంపై హైకోర్టులో విచారణ - కౌంటర్ దాఖలుకు మరో 2 వారాల సమయం

Bapatla District : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ యాజ్యమాన్య హక్కు చట్టం వల్ల రైతులు, సామాన్యులు నష్టపోతారని న్యాయవాదులు వాపోతున్నారు. భూ యాజమాని హక్కులను రెవెన్యూ అధికారులకు అప్పగించడం వల్ల రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం వల్ల దిగువ న్యాయస్థానంలో కేసును వాదించే అవకాశం లేకుండా, నేరుగా హైకోర్టును ఆశ్రయించే విధంగా చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ చీకటి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ చట్టం రద్దు చేసే వరకు రిలే దీక్షలు చేస్తామని న్యాయవాదులు తెలిపారు.

ప్రజా ఆస్తులను చట్టబద్దంగా హస్తగతం చేసుకునేందుకే 'భూయాజమాన్య హక్కు చట్టం'

AP Land Title Act : ప్రజా వ్యతిరేకమైన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటూ చీరాల న్యాయవాదుల ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటి చట్టం ప్రకారం స్థిరాస్తి విషయంలో తగాదాలు ఏర్పడితే, దానిని పరిష్కరించే అధికారం సివిల్​ కోర్టుల పరిధి నుంచి తప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే జిల్లా ట్రైబ్యునల్​కు అప్పగిస్తారన్నారు. ట్రైబ్యునల్ (Tribunal)​ నిర్ణయంపై అప్పీలు అధికారం హైకోర్టు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఈ కారణంగా సామాన్యులకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. ఈ చట్టం వల్ల న్యాయవాదులకు అన్యాయం జరుగుతుందని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని చట్టం గురించి తెలియని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. కానీ ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కుల వివాదాల పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధి నుంచి తొలగించి, రాజకీయ కబంధ హస్తాల చేతుల్లోకి తీసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. న్యాయనిపుణులతో సంప్రదించకుండా, ప్రజాభిప్రాయం లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం రూపొందించిదని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం చట్టాన్ని తీసుకురాలేదని కోర్టులను కూడా తప్పు దారి పట్టిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ చీకటి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details