Prathidwani :ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో కొన్నినెలలుగా న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు కదం తొక్కుతున్నారు. ఇంత వ్యతిరేకత వస్తున్నా, ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా జగన్ ప్రభుత్వం ప్రజల నెత్తిన రుద్దాలని చూస్తోన్న ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఏముంది? ఆ చట్టం ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారింది? దీనివల్ల ప్రజలకు కలిగే నష్టమేంటి? కొత్త చట్టంతో ప్రజల భూములు, ఆస్తులను వారి చేతుల్లో నుంచి లాగేసుకుంటారనీ, కబ్జాకోరులు చెలరేగిపోతారనే భయాలు పెరుగుతుండటానికి కారణాలేంటి? భూవివాదాలను పూర్తిగా సివిల్ కోర్టుల పరిధి నుంచి తప్పించేసి, అధికారుల చేతుల్లో పెడితే ఏం జరుగుతుంది? ఆస్తుల రక్షణకు ప్రజల ముందున్న మార్గమేంటి? ఈ అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.
Opposition Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2019 ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అది కార్యరూపం దాల్చితే భూ యాజమాన్య హక్కులకు ఒకే రికార్డు సరిపోనుంది. భూ పత్రాలు, దస్త్రాల ట్యాంపరింగ్ జరగకుండా ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు చెప్తున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో లోపాల కారణంగా చాలామంది యజమానులు పూర్తి స్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారు. ఫలితంగా భూ వివాదాలు ఏర్పడితే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. భూ రికార్డులు సరిగా లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందేందుకూ ఇబ్బంది పడుతున్నారు.