ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / opinion

బీమా ఉంటే జీవితానికి ధీమా- కుటుంబానికి ఆర్థిక భద్రత - Why All Need Insurance - WHY ALL NEED INSURANCE

Pratidhwani : బీమా ఉంటే జీవితానికి అదో ధీమా. అది కుటుంబానికి ఆర్థిక భద్రత. ఏం జరిగినా ఒక భరోసాను కల్పిస్తుంది. మనశ్శాంతిని ఇస్తుంది. ఊహించని ఆర్థిక భారాల నుంచి కాపాడుతుంది. ఈ విషయంలో విషయంలో అవగాహన లేక కొందరు, అన్నీ తెలిసీ ఏం కాదులే అనుకుని ఏదైనా జరిగాక బాధ పడే వారు మరెందరో.

WHY ALL NEED INSURANCE
బీమా ఉంటే జీవితానికి ధీమా - కుటుంబానికి ఆర్థిక భద్రత (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 12:30 PM IST

Pratidhwani : ఆరోగ్య బీమా అనేది పేద, మధ్యతరగతి కుటుంబాలకు వరప్రదాయిని లాంటిది. మాకెలాంటి ఆరోగ్య సమస్యలు లేవు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాం అనే ధీమాతో కొంతమంది ఈ పాలసీ తీసుకోవడానికి నిరాకరించి తర్వాత పశ్చాతాప పడిన మన సహచరుల ఉదంతాలు కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. ఒకవేళ పాలసీ తీసుకున్నా దానిని వాడుకునే అవకాశం రావట్లేదు కాబట్టి వృథాగా ఎందుకు ఏటా డబ్బులు కట్టాలి అనే ఉద్దేశంతో రెన్యువల్‌ చేయించుకోకుండా మధ్యలోనే డ్రాప్‌ అయ్యేవారు ఉన్నారు. ఈ రెండు నిర్ణయాలు తప్పు.

కుటుంబానికి ఆర్థిక భద్రత :విదేశాల్లో అయితే ఆరోగ్యబీమా అనేది ప్రతి మనిషీ తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. చివరికి కొన్ని దేశాల్లో పర్యాటకుడిగా సందర్శించడానికి వెళ్లాలి అన్నా సరే తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ పాలసీ కట్టాలి. బీమాకి ఉన్న ప్రాధాన్యత అది. భారతదేశంలో వార్షిక ఆదాయంలో అత్యధికశాతం వ్యయం ఆరోగ్యంపైనే ప్రతి మనిషి ఖర్చు చేస్తున్నాడు. మన కుటుంబం వాడుకున్న, వాడుకోకపోయినా ఆరోగ్యబీమా తీసుకోవడం, ప్రతి ఏటా విధిగా రెన్యువల్‌ చేయించుకోవడం అనేది మన కుటుంబానికి శ్రీరామరక్ష.

ఉత్తరాంధ్రలో వరద బీభత్సం - ప్రజాప్రతినిధులు పర్యటించి చక్కదిద్దే ప్రయత్నం - FLOOD EFFECT IN UTTARANDRA

అవగాహన రాహిత్యం :ఇవాళ నాణ్యమైన వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. వంట్లో బాగా లేకపోతే కన్స్‌ల్టేషన్‌కి వెళ్లి ఆ ఫీజు చెల్లించగలగటం, మందులు కొనడం, వైద్యపరీక్షలు చేయించడమే చాలామందికి ఎంతో భారమైన విషయం. దానికే అప్పు చేయాల్సిన పరిస్థితుల్లో ఇన్‌పేషంట్‌గా ఆస్పత్రిలో చేరటానికి, చికిత్స పూర్తయి ఇంటికి చేరేదాక ఎంత డబ్బు చేతిలో ఉండాలో మీకు తెలియంది కాదు. ఆస్పత్రికి పరిగెట్టగానే అప్పటికప్పుడు అప్పు కోసం ఎందర్నో అడిగి ఎన్నో ఇబ్బందులు పడుతున్న సహచరులు చాలామంది ఉన్నారు. జీవితంలో ఆపదలు, ఆరోగ్యసమస్యలు చెప్పి రావు.

రహదారులకు వరద కష్టం - రాష్ట్రవ్యాప్తంగా 5,921 కి.మీ. ధ్వంసం - Roads Destroyed in ap


తీరని నష్టం మిగిల్చిన వర్షాలు, వరదలు :ఇప్పుడు చర్చకు కారణం తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు, వరదలు మిగిల్చిన విలయం. అది చేసిన గాయం. లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయిన నడిరోడ్డుపై నిల్చున్నాయి. వేలాది వాహనాలు, పశు సంపద, పంటలు నష్టపోయారు. ఆరోగ్యపరంగానూ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. చాలామంది కట్టుబట్టలతోనే మిగిలి ప్రభుత్వం, దాతల సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. మరి ఇదే పరిస్థితుల్లో అందరికీ బీమా ఉంటే ఎలా ఉండేది? అది ఎందుకు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో బీమా రంగంలో విశేష అనుభవజ్ఞులు ఇన్సూరెన్స్​ మూర్తి, గుడ్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ ఎండీ శ్రీకాంత్​ చరణ్​ ముదిగొండ పాల్గొన్నారు.

బుడమేరు కన్నీరు - సర్వం తుడిచి పెట్టేసిందని ఘొల్లుమంటున్న బాధితులు - Home Appliances damage

ABOUT THE AUTHOR

...view details