తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఐక్యంగా 'ఇండియా' కూటమి! కానీ ఆ సీట్ల విషయంలో శివసేనపై కాంగ్రెస్​ ఫైర్!! - INDIA Bloc Cooperation

INDIA Bloc Cooperation : లోకసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఏప్రిల్ 19 నుంచి వివిధ దశల్లో పోలింగ్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత కూటమి పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నాగ్​పుర్​ నుంచి నాగౌర్​ వరకు ఇండియా బ్లాక్​ ఐక్యత స్పష్టంగా కనిపించింది. కానీ పలు సీట్లకు శివసేన (యూబీటీ) అభ్యర్థులను ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

INDIA Bloc Cooperation
INDIA Bloc Cooperation

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 3:07 PM IST

INDIA Bloc Cooperation : లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జోరుగా తమ తమ ప్రచారాలను ప్రారంభించాయి. మహారాష్ట్రలో ప్రతిపక్ష భారత కూటమిలో భాగమైన మహా వికాస్​ అఘాడీ కూటమి (ఎంవీఏ) లోక్‌సభ సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేసింది. శివసేన (యూబీటీ) 19 స్థానాల్లో, కాంగ్రెస్​ 16 స్థానాల్లో, శరద్​ పవార్​ ఎన్సీపీ 9 స్థానాల్లో అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నప్పటికీ ఇంకా నాలుగు స్థానాలపై అభ్యర్థుల ప్రకటన ఓ కొలిక్కి రాలేదు. ఈ నాలుగు స్థానాలపై ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) కాంగ్రెస్​ మధ్య టగ్​ ఆఫ్​ వార్​ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం నాగ్​పూర్​ నుంచి నాగౌర్​ వరకు జరిగిన నేతల నామినేషన్ల దాఖలు, రోడ్​ షోలతో ఇండియా బ్లాక్​ పార్టీల మధ్య ఐక్యత స్పష్టంగా కనిపించింది. మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో కాంగ్రెస్​ లోకసభ అభ్యర్థి వికాస్​ ఠాక్రే నామినేషన్​ కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన యూబీటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇక రాజస్థాన్‎లోని నాగౌర్‎లో ఆర్ఎల్‎పీ నాయకుడు హనుమాన్​ బెనివాల్​ ఎన్నికల అధికారులకు తన నామినేషన్‎ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. అయితే నాగౌర్​ స్థానాన్ని కాంగ్రెస్​ ఆర్ఎల్‎పీకి కేటాంచింది. మహారాష్ట్రలో ఈ ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కాగా, ఈ నామినేషన్​ కార్యక్రమంలో ఏఐసీసీ గుజరాత్ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ రామ్​ కిషన్​ ఓజా పాల్గొన్నారు. 'ఈ రోడ్​ షో విజయవంతమైంది. నాగ్‌పూర్​ అభ్యర్థి వికాస్​ ఠాక్రే నామినేషన్​ దాఖలులో మహా వికాస్ అఘాడి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు' అని ఓజా తెలిపారు. నాగ్‌పూర్‌లో ఐక్యతా పశ్చిమ రాష్ట్రానికి ఓ చక్కటి సందేశం ఇచ్చిందని ఆయన చెప్పారు.

లోకసభ అభ్యర్థిగా నామినేషన్​ దాఖలు చేసిన వికాస్​ కాంగ్రెస్​ సిట్టింగ్ ఎమ్మెల్యే. వికాస్​ ఠాక్రే తన నామినేషన్​ దాఖలు చేసిన సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్ నానా పటోలే, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్​ వడెట్టివార్‌తో పాటు ఎన్సీపీ-ఎస్‌పీ గ్రూపు నుంచి రాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్​ దేశ్‌ముఖ్​, శివసేన యూబీటీ ఎమ్మెల్సీ దుష్యంత్​ చతుర్వేది ఉన్నారు. శివసేన, యూబీటీల కఠిన వైఖరి కారణంగా సీట్ల పంపకాల ప్రకటన ఆలస్యమవుతోందన్న వార్తలు వస్తున్న తరుణంలో ఇండియా కూటమి ఐక్యత ప్రదర్శించడం విశేషం. 'సాంగ్లీ, భివాండీ, కొల్హాపూర్‌ మినహా చాలా వరకు స్థానాల్లో పొత్తు చర్చలు పూర్తయ్యాయి. ఇవి కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతాయి' అని ఏఐసీసీ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

అయితే దుంగార్‌పూర్-బన్స్వారా మినహా మొత్తం 24 స్థానాలకు కాంగ్రెస్​ అభ్యర్థులను ప్రకటించింది. గిరిజన సంస్థ బీఏపీతో ప్రతిపాదిత పొత్తు అనిశ్చితంగా ఉందని పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఉదయ్‌పూర్‌ నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి తారాచంద్‌ మీనాను తాను దాఖలు చేసిన నామినేషన్​ను ఉపసంహరించుకోవాలని, ఆ స్థానాన్ని తన మిత్రపక్షానికి వదిలేయాలని బీఏపీ డిమాండ్‌ చేస్తోంది. అయితే స్థానిక కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా లేరని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మాజీ కాంగ్రెస్​ నాయకుడు జ్యోతి మిర్ధా ఇప్పుడు నాగౌర్​ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. 2019లో ఎన్‌డీఏ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన హనుమాన్​ బెనివాల్‌తో బరిలోకి దిగనున్నారు.

నాగౌర్‌లో జాట్​ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రత్యర్థి అభ్యర్థులిద్దరూ ఆ వర్గానికి చెందినవారే. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నాగౌర్‌లో జ్యోతిపై హనుమంతరావు విజయం సాధించారు. ఇది 2024లో పోటీని చాలా ఆసక్తికరంగా మార్చింది. ఈ నేపథ్యంలో ఈ స్థానంపై కాంగ్రెస్​, బీజేపీ లోతుగా దృష్టి సారించాయి. ఎలాగైనా సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

తొలి లోక్​సభ ఎన్నికలు జరిగి 73ఏళ్లు- అప్పుడు 14, ఇప్పుడు 6- ఏంటీ కథ? - Loksabha Election National Parties

విపక్షాలపై బీజేపీ 'రామబాణం'- ఎన్నికల్లో అయోధ్య రామాలయం ప్రభావం చూపుతుందా? - Ram Temple impact On Elections

ABOUT THE AUTHOR

...view details