తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆశలపల్లకిలో వేతనజీవుడు - రానున్న బడ్జెట్‌లోనైనా తీపికబుర్లుంటాయా? - Income Tax Slabs Revision - INCOME TAX SLABS REVISION

Prathidhwani : కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తు మొదలైన వేళ.. మరోసారి ఆశలపల్లకిలో ఊగిసలాడుతు న్నాడు వేతనజీవుడు. ఈసారైనా వారి ఆశలు నెరవేరనున్నాయా? ఆదాయపన్నుశ్లాబులు, రేట్ల విషయంలో మార్పులు రానున్నాయా? ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వస్తోన్న సంకేతాలు, నిపుణుల అంచనాలైతే అటువైపే మొగ్గు చూపిస్తున్నాయి తదితర అంశాలపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని కార్యక్రమం.

Pratidhvani
Pratidhvani (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 10:26 AM IST

Income Tax Slabs Revision in Budget Today Prathidwani : కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తు మొదలైన వేళ మరోసారి ఆశలపల్లకిలో ఊగిసలాడుతు న్నాడు వేతనజీవుడు. ఈసారైనా వారి ఆశలు నెరవేరనున్నాయా? ఆదాయపన్నుశ్లాబులు, రేట్ల విషయంలో మార్పులు రానున్నాయా? ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వస్తోన్న సంకేతాలు, నిపుణుల అంచనాలైతే అటువైపే మొగ్గు చూపిస్తున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, ఆదాయాల్లో కానరాని పెరుగుదల, అధికధరలతో ప్రజలంతాఇబ్బంది పడుతున్న వేళ తగ్గింపులు ఉండొచ్చన్న ఆశాభావమే బలంగా వ్యక్తమవుతోంది. వచ్చే నెలలోనే ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తీపికబర్లు చెప్పవచ్చని అంతా ఎదురు చూస్తున్నారు. మరి, ఈ విషయంలో వేతనజీవులు, మధ్యతరగతి ఆశలు, ఆకాంక్ష లు ఏమిటి? ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది?

ప్రభుత్వం ఆశిస్తున్న వినియోగ వ్యయాల పెంపు పన్నురేట్ల తగ్గింపు ఒక్క నిర్ణయంతోనే సాధ్య మా? ఈ విషయంలో ప్రజల కొనుగోలుశక్తి పెంచడానికి ఇంకా చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? సంక్షేమ కేటాయింపు పెంచడమా పన్ను ఊరట కల్పించడమా అన్న రెండు మార్గాల్లో 2వ దాని వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న విశ్లేషణలకు కారణమేంటి? ఎన్డీయే తొలిరెండు దఫాల్లోనూ రాజకీయాంశాలు, ఆర్థిక విధాన నిర్ణయాల మధ్య స్పష్టమైన విభజన పాటించారు. మొత్తంమీద చూస్తే ఈ దఫా వారి ఆర్థిక ప్రాధాన్యాలు ఎలా ఉండొచ్చు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details