ETV Bharat Pratidhwani :జగన్ మోహన్ రెడ్డికి రాయలసీమ ఎందుకు ఓటేయాలి? 2019లో వైసీపీ అధికారంలోకి రావటానికి అండగా నిలిచింది రాయలసీమ ప్రాంతం. 52 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాయలసీమలో వైసీపీ 49 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 8 లోక్‌సభ స్థానాలనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. అంత ఆదరణ చూపిన తన ప్రాంతానికి ముఖ్యమంత్రి అవగానే జగన్ మోహన్ రెడ్డి ఏం మేలు చేశారు? వారి సమస్యలు ఏం పరిష్కరించారు? సీఎం పదవిలో కూర్చోవటం కోసం సీమకు చేసిన వాగ్దానాలు ఏంటి? ఎన్ని హామీలు నెరవేర్చారు? వైఎస్సార్సీపీ పాలనలో సీమ ప్రజలు సంతోషంగా ఉన్నారా? జగన్‌కు రాయలసీమ ఎందుకు ఓటేయాలి? అనే అంశంపైనేటి ప్రతిధ్వని.ఈ చర్చలోరైతు సంఘం అధ్యక్షుడు జీ ఈశ్వరయ్య, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఐదేళ్ల కాలంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అధికార వైసీపీలో కుమ్ములాటలు పతాక స్థాయి చేరాయి. సీఎం జగన్ సరిగా పని చేయని చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థానచలనం కల్పించారు. రాజీనామాలు, వలసలతో అధికార పార్టీ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటుంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ - బీజేపీ కూటమిగా ఏర్పడింది. ఎన్డీఏ కూటమి నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కూటమి గాలి రాయలసీమ జనం వైపు గట్టిగా వీస్తోందంటున్న రాజకీయ నిపుణులు అంటున్నారు.
చంద్రబాబు అంటే ఐటీ - జగన్ అంటే లూటీ : ప్రతిధ్వనిలో రాజకీయ విశ్లేషకులు